నాణ్యమైన విత్తనాన్నే అందిస్తాం : డీఏఓ

ABN , First Publish Date - 2022-05-28T06:47:47+05:30 IST

రైతులకు నాణ్యమైన విత్తనవేరుశనగను పంపీణీ చేస్తామని, నాణ్యతలో రాజీపడే ప్రసక్తేలేదని జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) జీ శివన్నారాయణ తెలిపారు.

నాణ్యమైన విత్తనాన్నే అందిస్తాం : డీఏఓ
ధర్మవరంలో విత్తనకాయలను పరిశీలిస్తున్న డీఏఓ శివన్నారాయణ

ధర్మవరంరూరల్‌/బత్తలపల్లి, మే27: రైతులకు నాణ్యమైన విత్తనవేరుశనగను పంపీణీ చేస్తామని, నాణ్యతలో రాజీపడే ప్రసక్తేలేదని జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) జీ శివన్నారాయణ తెలిపారు. పట్టణంలోని వేరుశనగ విత్తన ప్రాసెసింగ్‌ యూనిట్స్‌ శ్రీసాయిసీడ్స్‌, విజేత అగ్రోటెక్‌ యూనిట్‌లను జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన రమణారెడ్డితో కలిసి ఆయన శుక్రవారం  తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాసెసింగ్‌ యూనిట్‌లో విత్తనకాయలను పరిశీలించి తూకాలను వేసి తనిఖీ చేశారు. 

   వారు మాట్లాడుతూ జూన 1వ తేదీ నుంచి విత్తనకాయలను రైతులకు పంపీణీ చేస్తామన్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన ప్రక్రియ కొనసాగుతోందని రిజిస్ట్రేషన చేసుకున్న ప్రతిరైతుకు విత్తనకాయలను అందజేస్తామన్నారు. విత్తనకాయల నాణ్యతలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఉపేక్షించేదిలేదన్నారు. జిల్లాకు 1.09లక్షల క్వింటాళ్లు కేటాయించగా అందులో 10,195 క్వింటాళ్ల కే-6రకం,  7,805క్వింటాళ్లు లేపాక్షిరకాన్ని రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లావ్యాప్తంగా 17881మంది రైతులు వేరుశనగ కోసం రిజిస్ట్రేషన చేసుకున్నారని తెలిపారు. వేరుశనగ కావాల్సిన రైతులు 1వతేదిలోపు రిజిస్ట్రేషనచేసుకోవాలని తెలిపారు. విత్తన నాణ్యతలేకున్నా, తూకాల్లో తేడా వచ్చినా చర్యలు తప్పవన్నారు. స్ర్పింక్లర్లు, డ్రిప్పు కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.  అలాగే ఆయన బత్తలపల్లి మండలంలోని పోట్లమర్రి గ్రామం ఆర్‌బీకేలోని విత్తన వేరుశనగకాయలను పరిశీలించారు. రైతుల రిజిస్ట్రేషనపై పరిశీలించారు. ఏడీపీ పీపీ విద్యావతి, ధర్మవరం ఏడీఏ క్రిష్ణయ్య, ఏఓలు చన్నవీరస్వామి, పెన్నయ్య, ఎంపీపీ గుర్రంవనజాశ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ దోశిరెడ్డి, సీడ్స్‌, అగ్రోటెక్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-28T06:47:47+05:30 IST