AP News: న్కూడ్ వీడియో ఒరిజినల్‌ కాదని ఎస్పీ చెప్పడాన్ని ఖండిస్తున్నాం: సీపీఎం

ABN , First Publish Date - 2022-08-12T01:46:35+05:30 IST

Amaravathi: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (Hindupur MP Gorantla Madhav) న్కూడ్ వీడియో ఒరిజినల్‌ కాదని అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని

AP News: న్కూడ్ వీడియో ఒరిజినల్‌ కాదని ఎస్పీ చెప్పడాన్ని ఖండిస్తున్నాం: సీపీఎం

Amaravathi: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (Hindupur MP Gorantla Madhav) న్కూడ్ వీడియో ఒరిజినల్‌ కాదని అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు (CPM State Secretary Srinivasa Rao) పేర్కొన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగి ఒక బాధ్యతాయుత పోలీసు అధికారి అలా ప్రకటించడం దారుణమన్నారు.   


‘‘గోరంట్ల మాధవ్‌ మహిళల గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కించపరిచేలా ప్రవర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం అతనిపై ఏ చర్యా తీసుకోలేదు. పోలీసులు పూర్తి సమాచారం రాబట్టకుండా వెనుకేసుకురావడం గర్హనీయం. ఇద్దరి మధ్య సంభాషణను మూడో వ్యక్తి రికార్డు చేశారని ఎస్పీ చెబుతున్నారు. అది మార్ఫింగ్‌ వీడియో అని చెప్పలేక పోయారు. దాని ఆరిజిన్‌ తెలుసుకోడానికి పోలీసు శాఖ ఏమి చేసిందో కూడా ఎస్పీ చెప్పలేక పోయారు. ఇది ఫేక్‌ అంటున్న మాధవ్‌ ఎందుకని పోలీసులకు ఫిర్యాదు చేయలేదో ఎస్పీ చెప్పాలి. తాను నిర్దోషి అయితే స్వయంగా ముందుకొచ్చి తన ఫోనును పరిశీలించేందుకు ఇవ్వాలి. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి  మాధవ్ ఘటన నాలుగు గోడల మధ్య వ్యవహారమని ప్రకటించడమంటే జరిగింది వాస్తవమని అంగీకరించినట్లే. జరిగింది వాస్తవమని తేలితే చర్య తీసుకుంటామని గతంలో ప్రకటించారు. మాటకు కట్టుబడి మాధవ్‌పై తక్షణం చర్య తీసుకోవాలని సీపీఎం డిమాండ్‌ చేస్తుంది. పార్లమెంట్‌ సభ్యుడిగా కొనసాగే నైతిక అర్హతను మాధవ్‌ కోల్పోయారు. తక్షణం ఆయన  రాజీనామా చేయాలి.’’ అని శ్రీనివాసరావు పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-12T01:46:35+05:30 IST