కప్పు కొట్టాలె: భారత జట్టుతో జగన్‌మోహన్‌రావు

ABN , First Publish Date - 2022-01-18T02:11:58+05:30 IST

ఆసియా హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు కఠిన డ్రా ఎదురైంది. టైటిల్‌ కోసం 16 జట్లు బరిలోకి దిగుతున్నాయి. కోవిడ్‌-19 తీవ్రత దృష్య్టా జపాన్‌, థాయ్‌లాండ్‌లు టోర్నీ నుంచి తప్పుకున్నాయి. ప్రిలిమినరీ రౌండ్‌, మెయిన్‌ రౌండ్‌లుగా టోర్నీని..

కప్పు కొట్టాలె: భారత జట్టుతో జగన్‌మోహన్‌రావు

లఖ్‌నవూ: ప్రతిష్టాత్మక ఆసియా హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్స్‌లో తొలిసారి పోటీపడుతున్న భారత జట్టు కప్పుతో తిరిగి రావాలని హ్యాండ్‌బాల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(హెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడు అరిశనపల్లి జగన్‌మోహన్‌రావు అభిలాశించారు. సౌదీ అరేబియా వేదికగా జనవరి 18 నుంచి ఆసియా మెన్‌ హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్స్‌ జరుగననున్నాయి. సౌదీ అరేబియాకు బయల్దేరడానికి ముందు భారత జట్టు ఆటగాళ్లతో హెచ్‌ఎఫ్‌ఐ ప్రెసిడెంట్‌ జగన్‌మోహన్‌రావు మాట్లాడారు. 'భారత్‌లో ఇప్పుడిప్పుడే హ్యాండ్‌బాల్‌ క్రీడకు మంచి ఆదరణ లభిస్తోంది. ఒలింపిక్స్‌ లక్ష్యంగా ఫెడరేషన్‌ హ్యాండ్‌బాల్‌ అభివృద్దికి కృషి చేస్తోంది. సమాఖ్య తరఫున ఆటగాళ్లకు అన్ని విధాల సహకారం అందిస్తాం. ఆసియా చాంపియన్‌షిప్స్‌లో పతకమే లక్ష్యంగా పోటీపడాలి. కప్పుతోనే తిరిగి రావాలి' అని ఆటగాళ్లతో జగన్‌మోహన్‌ రావు అన్నారు.  కార్యక్రమంలో పాల్గొన్న హెచ్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి తేజ్‌ రాజ్‌సింగ్‌, కోశాధికారి వినయ్‌ సింగ్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆనందీశ్వర్‌ పాండేలు భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.


ఆసియా హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు కఠిన డ్రా ఎదురైంది.  టైటిల్‌ కోసం 16 జట్లు బరిలోకి దిగుతున్నాయి. కోవిడ్‌-19 తీవ్రత దృష్య్టా జపాన్‌, థాయ్‌లాండ్‌లు టోర్నీ నుంచి తప్పుకున్నాయి. ప్రిలిమినరీ రౌండ్‌, మెయిన్‌ రౌండ్‌లుగా టోర్నీని నిర్వహిస్తున్నారు. ప్రిలిమినరీ రౌండ్‌లో 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఆతిథ్య సౌదీ అరేబియా, ఆస్ర్టేలియా, ఇరాన్‌లతో పాటు భారత్‌ గ్రూప్‌-బిలో నిలిచింది.  గ్రూప్‌-ఏలో దక్షిణ కొరియా, కువైట్‌, జోర్డాన్‌, సింగపూర్‌లు ఉండగా.. గ్రూప్‌-సిలో ఖతార్‌, యుఏఈ, ఇరాక్‌, ఓమన్‌లు ఉన్నాయి. గ్రూప్‌-డిలో బహ్రెయిన్‌, హాంగ్‌కాంగ్‌, ఉబ్జెకిస్థాన్‌, వియత్నాం చోటుచేసుకున్నాయి. గ్రూప్‌ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ప్రధాన రౌండ్‌కు అర్హత సాధించనున్నాయి. టోర్నీ ఆరంభ రోజు భారత్‌ తన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య సౌదీ అరేబియాతో తలపడనుంది.

Updated Date - 2022-01-18T02:11:58+05:30 IST