వయోవృద్ధుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తాం

ABN , First Publish Date - 2022-10-02T05:59:42+05:30 IST

ప్రత్యేక ట్రిబ్యునల్‌ ద్వారా వ యోవృద్ధుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు కలెక్ట ర్‌ పమేలాసత్పథి తెలిపారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక ఫంక్షన్‌హాల్‌లో మహిళ, శిశు, దివ్యాంగ, వయోృవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

వయోవృద్ధుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తాం
బహుమతి ప్రదానం చేస్తున్న కలెక్టర్‌ పమేలాసత్పథి

కలెక్టర్‌ పమేలాసత్పథి 

భువనగిరి రూరల్‌, అక్టోబరు1: ప్రత్యేక ట్రిబ్యునల్‌ ద్వారా వ యోవృద్ధుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు కలెక్ట ర్‌ పమేలాసత్పథి తెలిపారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక ఫంక్షన్‌హాల్‌లో మహిళ, శిశు, దివ్యాంగ, వయోృవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులతో భావితరాలకు సమస్యలు రాకుండా మార్గదర్శకంగా ఉంటున్న వయోవృద్ధుల పట్ల ప్రేమ, బాధ్యతతో మెలగాలన్నారు. వృద్ధులను వేధింపులకు గురిచేస్తే శిక్షార్హులవుతారని, వారి సంరక్షణకు చట్టాలున్నాయన్నారు. జిల్లాలో ప్రత్యేక ట్రిబ్యునళ్లు ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, వృద్ధులకు ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే టోల్‌ఫ్రీ నెంబర్‌ 14567కు ఫోన్‌చేయాలన్నారు. అనంతరం వృద్ధులకు నిర్వహించిన ఆటలపోటీల్లో విజేతల కు బహుమతి ప్రదానంచేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ, పొలి శంకర్‌రెడ్డి, జంపాల అంజయ్య, శెట్టి బాలయ్య యాదవ్‌, వెంకటేశ్‌, ఎఫ్‌ఆర్‌వో తిరుపతిరెడ్డి, సీడీపీవోలు పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో మందడి ఉపేందర్‌రెడ్డి, డీహెచ్‌ఎ్‌సవో అన్నపూర్ణ, వ్యాపన డైరెక్టర్లు శ్రీనివాస్‌, జి.మత్స్యేందర్‌, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-02T05:59:42+05:30 IST