మాట్లాడుతున్న జడ్పీచైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ
- జడ్పీచైర్ పర్సన్ న్యాలకొండ అరుణ
సిరిసిల్ల ఎడ్యుకేషన్, మార్చి 27: కరోనాతో మరణించిన ఉపాధ్యాయుల సేవలు మరువలేనివని, వారి కుటుంబాలను ఆదుకుంటామని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. ఆదివారం సిరిసిల్లలోని సాయిప్రియ ఫంక్షన్హాల్లో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో కరోనాతో మరణించిన ఎంఈవో రాజయ్య, ఓలాద్రి యాదగిరిరెడ్డి, కొడిపాక పవన్‌కుమార్, గుమ్మడి పవన్‌కుమార్, గున్నాల బాలరాజు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ఎంఈవో రాజయ్య సిరిసిల్లను జాతీయస్థాయిలో నిలబెట్టారని, ఎల్లారెడ్డిపేటలో ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం బోధనను ఒక సవాలుగా తీసుకున్నారని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఇంగ్లీష్ మీడియం నిర్ణయం వెనుక ఆ ప్రభావం కూడా ఉందన్నారు. ఆయన తెచ్చిన సంస్కరణలు అందరికి ఆదర్శమన్నారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి మాట్లాడుతూ యాదగిరి రెడ్డి, పవన్ కుమార్ విద్యార్థుల భవిష్యత్ కోసమే పరితపించిన వ్యక్తులు అన్నారు. బాలరాజు, ప్రకాష్ చిన్నతనంలోనే వారి కుటుంబాలకు దూరం కావడం జీర్ణించుకోలేని అంశమని అన్నారు. టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె .కిషన్‌రావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దోర్నాల భూపాల్‌రెడ్డి, దుమాల రమానాథ్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్లు పాతూరి మహేందర్‌రెడ్డి, గుజ్జునేని వేణుగోపాల్‌రావు, బాలచందర్, నాయకులు హన్మంతరెడ్డి, మల్లారపు పురుషోత్తం, సత్తురవీందర్, విక్కుర్తి అంజయ్య, పురం వాసుదేవరావు, దబ్బెడ హన్మాండ్లు, సూర భాస్కర్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు గన్నమనేని శ్రీనివాసరావు, జక్కని నవీన్, బి.నారాయణ, పద్మారెడ్డి, కుమ్మరి మల్లేశం, పిట్టల దేవరాజు, శర్మన్నాయక్, హాజునాయక్, లాల శ్రీనివాస్, వేణుమాధవ్శర్మ, విశ్వనాథ్, బుర్కగోపాల్ పాల్గొన్నారు.