జర్నలిస్టు కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం

ABN , First Publish Date - 2021-07-27T04:07:39+05:30 IST

అనారోగ్యంతో మరణించిన మర్కుక్‌ మండలం ‘ఆంధ్రజ్యోతి’ విలేకరి ఎర్రం రాజు యువరాజ్‌ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున అన్నివిధాలా ఆదుకుంటామని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, టీయూడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖాజా విరాహత్‌ అలీ అన్నారు.

జర్నలిస్టు కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం
యువరాజ్‌ కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న ప్రతా్‌పరెడ్డి, విరాహత్‌ అలీ

ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన  కార్యదర్శి ఖాజా విరాహత్‌ అలీ  

యువరాజ్‌ కుటుంబానికి రూ.4 లక్షల నగదు అందజేత

వర్గల్‌, జూలై 26 : అనారోగ్యంతో మరణించిన మర్కుక్‌ మండలం ‘ఆంధ్రజ్యోతి’ విలేకరి ఎర్రం రాజు యువరాజ్‌ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున అన్నివిధాలా ఆదుకుంటామని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు  ప్రతా్‌పరెడ్డి, టీయూడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖాజా విరాహత్‌ అలీ అన్నారు. సోమవారం వారు గజ్వేల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సి.రాజమౌళి, గజ్వేల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాదాసు అన్నపూర్ణశ్రీనివాస్‌, వర్గల్‌, మర్కుక్‌ మండలాల ప్రజాప్రతినిధులతో కలిసి వర్గల్‌ మండలం గౌరారంలో యువరాజ్‌ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరినీ నవ్విస్తూ, నవ్వుతూ ఉండే యువరాజ్‌ మరణించడం బాధాకరమన్నారు. యువరాజ్‌ అకస్మాత్తుగా మరణించడం గజ్వేల్‌ ప్రాంత జర్నలిస్టులకు, ప్రజాప్రతినిధులకు తీరని బాధను మిగిల్చిందన్నారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు, మర్కుక్‌ మండల ప్రజాప్రతినిధులు అందజేసిన రూ.4 లక్షలను యువరాజ్‌ భార్య ప్రవీణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మర్కుక్‌, వర్గల్‌ మండలాల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, నాగరాజు, మర్కుక్‌ ఎంపీపీ పాండుగౌడ్‌, మర్కుక్‌, వర్గల్‌ జడ్పీటీసీలు రాంచంద్రం, బాలుయాదవ్‌, వర్గల్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ రామకృష్ణారెడ్డి, వైస్‌ ఎంపీపీ బాల్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు కృపాకర్‌రెడ్డి, గజ్వేల్‌ జర్నలిస్ట్‌ కాలనీ సంక్షేమ సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సురేందర్‌, మధుసూదన్‌రెడ్డి, సీనియర్‌ పాత్రికేయులు కృష్ణ, విజయరావు, ఎల్లారెడ్డి, జగన్‌, పవన్‌, రంగారెడ్డి, శంకర్‌, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-27T04:07:39+05:30 IST