ప్లకార్డులు ప్రదర్శిస్తున్న ‘జబర్దస్త్’ కమెడీయన్లు, జీవీఎంసీ అధికారులు
జీవీఎంసీలో సందడి చేసిన ‘జబర్దస్త్’ బృందం
సిరిపురం, మార్చి 27: వుయ్ సపోర్ట్ విశాఖ.. వుయ్ లవ్ వైజాగ్ అంటూ ‘జబర్దస్త్’ కమెడీయన్ల బృందం నగరంలో సందడి చేసింది. ఆదివారం ఈ బృందం జీవీఎంసీ కార్యాలయానికి వచ్చింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైజాగ్ పరిసరాలు తమను కట్టిపడేస్తాయన్నారు. జీవీఎంసీ చేపట్టే కార్యక్రమాలు తమను ఆకట్టుకుంటాయని బుల్లెట్ భాస్కర్, ఆటో పంచ్‌ల రాంప్రసాద్, లేడీ గెటప్ శాంతిస్వరూప్, నాటీ నరేశ్, ఫైమాలు పేర్కొన్నారు. విశాఖలోని ఓ కార్యక్రమానికి విచ్చేసిన తాము జీవీఎంసీని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు తాము ఇష్టపడే వైజాగ్‌కే తమ తొలి ఓటు అంటూ ‘ఐ సపోర్ట్ వైజాగ్’ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. జీవీఎంసీ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జీవీఎంసీ ప్రథమ ర్యాంక్ సాధించేలా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంహెచ్వో శాస్త్రి, సెక్రటరీ ఫణిరామ్, ఏపీఆర్వో ఎన్.నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.