
ఏలూరు: మహిళా ఉద్యోగులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ భరోసా ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్లో బుధవారం ఆమె అధ్యక్షతన ‘సబల’ పేరిట తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలపై వివక్ష ఇప్పటికీ కొనసాగుతోందని, పని ప్రదేశాల్లో వేధింపులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగులు తోటి ఉద్యోగుల నుంచే అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని, దీనిని నియంత్రించేందుకు మహిళా కమిషన్ అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. వేధింపులపై ఫిర్యాదుల కోసం సబల్ వాట్సాప్‌ను ఆవిష్కరించామని, సమస్యలున్న వారు ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అంతర్గత ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేస్తామని వాసిరెడ్డి పద్మ తెలిపారు.
ఇవి కూడా చదవండి