మెరుగైన వేతన ఒప్పందాన్ని సాధిస్తాం

ABN , First Publish Date - 2021-07-25T06:03:19+05:30 IST

11వ వేజ్‌బోర్డులో మెరుగైన వేతన ఒప్పందా న్ని సాధిస్తామని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య పేర్కొన్నారు.

మెరుగైన వేతన ఒప్పందాన్ని సాధిస్తాం
మాట్లాడుతున్న సీతారామయ్య

- ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య

యైటింక్లయిన్‌కాలనీ, జూలై 24: 11వ వేజ్‌బోర్డులో మెరుగైన వేతన ఒప్పందా న్ని సాధిస్తామని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య పేర్కొన్నారు. శనివారం వీకేపీ గనిలో జరిగిన గేట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. వేజ్‌బోర్డు లో వీడీఏ న్యూట్రలైజేషన్‌, 50 శాతం వేతనాల పెరిగేందుకు కృషి చేస్తాయను న్నట్టు తెలిపారు. సిక్‌ లీవు ఎన్‌క్యాష్‌మెంట్‌తో పాటు పురుషులకు మెటర్నిటీ లీవు ఇంక్రిమెంట్‌ 6శాతం, ఎల్‌ఎల్‌టీసీ 75వేలు, ఎల్‌టీసీ 50వేలు, లీవుల పీ హెచ్‌డీలు పెంచేందుకు పట్టుబడతామని అన్నారు. ట్రాన్స్‌పోర్టు సబ్సిడీ 20 శాతం వరకు డిమాండ్‌ పెట్టినట్టు, మిగులు క్వార్టర్‌లను రిటైర్‌ కార్మికులకు ఇ వ్వాలని, పెర్స్క్‌పై ఐటీని కోల్‌ ఇండియా చెల్లిస్తున్న విధంగా రీయంబర్స్‌ చేయా లని మొదటి సమావేశంలోనే డిమాండ్‌ పెట్టినట్టు సీతారామయ్య అన్నారు. కార్మికుల రిటైర్మెంట్‌ వయస్సు 61 ఏళ్ళకు పెంచడం హర్షనీయమని, కానీ అప్షన ల్‌గా ఉండాలన్నారు. జేబీసీసీఐలో జరిగిన ఒప్పందాలనుసింగరేణిలో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. గతంలో కొన్ని ఒప్పందాలను అమలు చేయకపో వడంతో కార్మికులకు అన్యాయం జరిగినట్టు సీతారామ య్య తెలిపారు. ఈ గేట్‌ మీటింగ్‌లో ఎల్‌ ప్రకాష్‌, రాజారత్నం, బుర్ర తిరుపతి, అన్నారావు, సాంబశివరా వు, సంపత్‌, శంకర్‌, మల్లయ్య, రాజు, వెంకటేష్‌, ప్రవీణ్‌లు పాల్గొ న్నారు.

Updated Date - 2021-07-25T06:03:19+05:30 IST