రెండు నెలల్లో కొత్త పింఛన్లు, రేషన్‌కార్డులిస్తాం

ABN , First Publish Date - 2022-06-28T05:13:02+05:30 IST

రాబోయే రెండు నెలల్లో కొత్త పింఛన్లు, కొత్త రేషన్‌ కార్డులి స్తామని రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడలు, పర్యాటక శాఖ మం త్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

రెండు నెలల్లో కొత్త పింఛన్లు, రేషన్‌కార్డులిస్తాం
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

- ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

- మహబూబ్‌నగర్‌ రూరల్‌ 

  మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం

మహబూబ్‌నగర్‌ రూరల్‌, జూన్‌ 26:  రాబోయే రెండు నెలల్లో కొత్త పింఛన్లు, కొత్త రేషన్‌ కార్డులి స్తామని రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడలు, పర్యాటక శాఖ మం త్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సోమవారం మహ బూబ్‌నగర్‌ రూరల్‌ మండల పరిషత్‌ సర్వసభ్య స మావేశం జిల్లా కేంద్రంలోని మండల పరిషత్‌ స మావేశమందిరంలో ఎంపీపీ సుధాశ్రీ రాఘవేందర్‌ అధ్యక్షతన నిర్వహించారు.  సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ కొత్త పింఛన్ల లబ్ధిదారుల ఎంపిక బాధ్యత సర్పంచ్‌లు, కార్యదర్శులదేనని, అర్హులను గుర్తించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎంపిక చేయాలన్నారు.  మండలంలోని అన్ని గ్రామాలను అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ పరిధిలోకి తెచ్చామని, దీంతో మౌ లిక వసతులు పట్టణాల స్థాయిలో ఏర్పడతాయని అన్నారు. అన్ని గ్రామాల్లో క్రీడాప్రాంగణాలు ఏ ర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, స్థలాల ఎం పిక బాధ్యతను తహసీల్దార్లు తీసుకొని సహకరిం చాలన్నారు. ప్రతీ గ్రామంలో చెరువులు నింపుతా మని, కాల్వలను ఏర్పాటుచేసి ప్రతీ ఇంచు భూమి కి సాగునీరిస్తామని స్పష్టం చేశారు. ఇప్పలపల్లిలో పింఛన్లను గాజులపేటలో వెళ్లకుండా ఇక్కడే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జడ్పీటీసీసభ్యురాలు పుల్లూరి వెంక టేశ్వరమ్మ, వైస్‌ ఎంపీపీ అనిత, ఎంపీడీవో వేదవతి, తహసీల్దార్‌ ఆర్‌ పాండు, ఎంపీవో నరేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షు డు మల్లు దేవేందర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-28T05:13:02+05:30 IST