న్యాయం కోసం పోరాడుతాం, ప్రశ్నిస్తాం

ABN , First Publish Date - 2022-10-02T05:07:28+05:30 IST

: రాష్ట్రంలో వైసీపీ అరాచకాలను ఎండగడతామని, న్యాయం కోసం పోరాడతాం, ప్రశ్నిస్తామని టీడీపీ పొలిట్‌ బ్యూరోసభ్యు లు ఆర్‌.శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

న్యాయం కోసం పోరాడుతాం, ప్రశ్నిస్తాం
పోలీసుస్టేషన్‌ నుంచి బయటికి వస్తున్న టీడీపీ నేతలు

టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి

కడప (ఎర్రముక్కపల్లె), అక్టోబరు 1: రాష్ట్రంలో వైసీపీ అరాచకాలను ఎండగడతామని, న్యాయం కోసం పోరాడతాం, ప్రశ్నిస్తామని టీడీపీ పొలిట్‌ బ్యూరోసభ్యు లు ఆర్‌.శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కడప నగరం చిన్నచౌకు పోలీసుస్టేషన్‌లో శనివారం సాయంత్రం టీడీపీ నేతలకు 41 నోటీసు ఇచ్చినందుకు సీఐ అశోక్‌రెడ్డి ని టీడీపీ నేతలు కలిశారు. అనంతరం శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని వైసీపీ ప్రభుత్వం అనేక పన్నాగాలు పన్నుతోందన్నారు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని వాపోయారు.

Ùఅన్నక్యాంటిన్‌ తొలగించడంతో దానిని కొనసాగించాలని అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద నిరసన చేస్తే దానిపై టీడీపీ నేతలు దాదాపు 25 నుంచి 30 మందిపై 41 నోటీసు జారీ చేశారన్నారు. పోలీసులు కేసులు పెడితే భయపడేదిలేదన్నారు. న్యాయం కోసం టీడీపీ ముందుంటుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ కడప నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ అమీర్‌బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి, మాజీ నగర అధ్యక్షు డు జిలానీబాషా, టీడీపీ నేతలు రాంప్రసాద్‌, సుబ్బారెడ్డి, పార్ధసారధిరెడ్డితో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-02T05:07:28+05:30 IST