ఇసుక క్వారీల అక్రమాలపై విచారణ చేపడతాం

ABN , First Publish Date - 2020-12-03T05:10:29+05:30 IST

బీర్కూర్‌ మంజీరా పరివాహక ప్రాంతం లోని ఇసుక క్వారీల అక్రమాలపై విచారణ చేపట్టి, అక్రమాలు జరిగి తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ శరత్‌ అన్నారు.

ఇసుక క్వారీల అక్రమాలపై విచారణ చేపడతాం
బీర్కూర్‌ రహదారి పక్కన నాటిన మొక్కలను పరిశీలిస్తున్న కలెక్టర్‌

పల్లెప్రగతిపై అధికారులతో కలెక్టర్‌ సమీక్ష 

అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలి 

ధరణి రిజిస్ట్రేషన్‌లపై  అవగాహన కల్పించాలి 

బీర్కూర్‌, డిసెంబరు 2: బీర్కూర్‌ మంజీరా పరివాహక ప్రాంతం లోని ఇసుక క్వారీల అక్రమాలపై విచారణ చేపట్టి, అక్రమాలు జరిగి తే  కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ శరత్‌  అన్నారు. బుధవా రం కలెక్టర్‌ శరత్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ బీ ర్కూర్‌ తహసీల్‌లో పల్లెప్రగతి, పంచాయతీరాజ్‌, ఉపాధిహామీ అధి కారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అంతకుముందు బీర్కూర్‌ మంజీరా నది పరివాహక ప్రాంతంలోని ఇసుక రిచ్‌లలోని అక్రమాలపై పలువురు కలెక్టరు దృష్టికి తీసుకెళ్లింది. వే బిల్లులు లేకుండానే లారీల్లో ఇసుకను రేయింబవళ్లు తరలిస్తున్నారని, నిత్యం దాదాపు రూ.20లక్షల మేర గుత్తేదారులు అక్రమంగా సంపాదిస్తున్నా రని కలెక్టర్‌కు వివరించారు. ఈ మేరకు కలెక్టర్‌ స్పందించి ఇసుక క్వారీల్లో జరుగుతున్న అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపడు తామన్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ హరితహారం మొ క్కలను సంరక్షించడంలో ఎంపీవో అనిత, ఎంపీడీవో భోజారావు, జీపీ కార్యదర్శి యోగేశ్‌ విఫలమయ్యారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎంపీవో అనిత, కార్యదర్శి యోగేష్‌లకు చార్జీ మెమోలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూము ల రిజిస్ర్టేషన్లు చేయడంలో జిల్లాలోనే బీ ర్కూర్‌ అగ్రస్థానంలో నిలిచిందని కలెక్టర్‌  తహసీల్దార్‌ గణేష్‌ను అభినందించారు.  అ నంతరం తెలంగాణ తిరుమల దేవస్థానంలో ని వేంకటేశ్వర స్వామి, అమ్మవార్లను దర్శిం చుకుని  పూజలు నిర్వహించారు.

అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన  ప్రతీ మొక్కను సంరక్షించాలి

బాన్సువాడ: జిల్లాలో 3లక్షల 53వేల మె ట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, రైతుల ఖాతాల్లో రూ.651కోట్లను జమ చేశామని కలెక్టర్‌ శరత్‌ అన్నారు. బుధవారం బాన్సువాడ పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ రిజిస్ర్టేషన్లను పరిశీలించారు. దేశాయిపేట్‌లో రైస్‌మిల్లును పరిశీలిం చి నిర్వాహకులతో మాట్లాడారు. అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలన్నారు. మొక్కలు ఎండిపోతే పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌లపై చర్యలు తీసుకుంటామన్నారు.

తడి, పొడి చెత్తను వేరు చేయాలి

నస్రుల్లాబాద్‌: గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేరు చేసి కంపోస్టు షెడ్డులకు తరలించాలని, సేంద్రీయ ఎరువులను తయారు చేసి విక్రయించడం ద్వారా జీపీలకు ఆదాయం పెంచుకోవచ్చని కలెక్టర్‌ శరత్‌ అన్నారు. బుధవారం నస్రుల్లాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయం లో ధరణి పోర్టల్‌ ద్వారా భూములను రిజిస్ర్టేషన్‌ చేసుకున్న రైతు లకు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమాలల్లో అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, డీఆర్‌డీవో చంద్రమోహన్‌ రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్‌, ప్రత్యేకాధికారి శ్రీకాంత్‌, తహసీల్దార్‌ గణేష్‌, ఎంపీడీవో బోజారావు, ఏవో కమల, ఏపీవో అక్మల్‌ తదితరులు పాల్గొన్నారు. 

ధరణి రిజిస్ట్రేషన్‌లో జిల్లాకు ప్రథమస్థానం

గాంధారి: రాష్ట్రంలో ధరణి రిజిస్ట్రేషన్లు చేయడంతో జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్‌ తెలిపారు. బుధవారం గాంధారి తహ సీల్ధార్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు 3300 రిజిస్ట్రేషన్‌లు పూర్తి చేసి ప్రథమస్థానంలో నిలిచామన్నారు. రెవెన్యూ అధికారులు ధరణిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 25 శాతం కూలీలు ఉపాధి హామీ పనులకు వచ్చేలా అధికారులు చొ రవ చూపాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్‌నాయక్‌, తహసీ ల్ధార్‌ నాగరాజుగౌడ్‌, ఎంపీడీవో సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-03T05:10:29+05:30 IST