ఆయకట్టు చివరి ఎకరాకూ నీరందిస్తాం

Sep 18 2021 @ 01:14AM
సహరార సంఘం గోదాంకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి

మేళ్లచెర్వు / చింతలపాలెం, సెప్టెంబరు 17: హుజూర్‌నగర్‌ నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న ఎత్తిపోతల పథకాల పరిధిలోని ఆయకట్టు చివరి ఎకరా కూ నీరందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మేళ్లచెర్వులో రూ.65లక్షలతో 1000 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల సహకార గోదాంల నిర్మాణానికి ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్త ఎత్తిపోతల పథకాల ఏర్పాటు, నిర్వహణ, నిధుల మంజూరులో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. అన్ని ఎత్తిపోతల పథకాల ద్వారా ఆయకట్టు భూములకు నీరందించి, అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సహకార గోదాంల నిర్మాణానికి సహకరించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్‌ మండపంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమంలో డీసీసీబీ సీఈవో మదన్‌మోహన్‌, సర్పంచ్‌ పందిళ్లపల్లి శంకర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కాకనూరి శంభిరెడ్డి, సీఈవో గుమ్మిత వెంకటరెడ్డి, నాయకులు సూరిశెట్టి బసవయ్య, బాలవెంకటరెడ్డి, లక్ష్మణ్‌కుమార్‌, పాలకవర్గసభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా చింతలపాలెం మండల కేంద్రంలోనూ సహకర సంఘం గోదాంల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం బస్టాండ్‌ సెంటర్‌లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.  

Follow Us on: