అడ్డంకులు ఎదురైనా మహానాడును విజయవంతం చేస్తాం

ABN , First Publish Date - 2022-05-27T07:25:24+05:30 IST

ప్రభుత్వం అధికారులు, పోలీసుల అండతో ఎన్ని అడ్డంకులు సృష్టించినా మహానాడును విజయవంతం చేస్తా మని కందుల నారాయణరెడ్డి సోదరుడు, జడ్పీ టీసీ మాజీ సభ్యుడు కందుల రామిరెడ్డి అన్నారు.

అడ్డంకులు ఎదురైనా మహానాడును విజయవంతం చేస్తాం
సమావేశంలో మాట్లాడుతున్న రామిరెడ్డి

జడ్పీటీసీ మాజీ సభ్యుడు కందుల రామిరెడ్డి

మార్కాపురం, మే 26: ప్రభుత్వం అధికారులు, పోలీసుల అండతో ఎన్ని అడ్డంకులు సృష్టించినా మహానాడును విజయవంతం చేస్తా మని  కందుల నారాయణరెడ్డి సోదరుడు, జడ్పీ టీసీ మాజీ సభ్యుడు కందుల రామిరెడ్డి అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో గురువారం మహానాడు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ మండవ వారిపాలెం జరిగే 40వ మహా నాడుకు పార్టీ నాయకులు, కార్య కర్తలు భారీగా తరలివచ్చేం దుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అధికార పార్టీ నాయకులు ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇవ్వకుండా అడ్డుకోవడం, పోలీసులతో ప్రైవేటు వాహనాల యజమా నులను నియంత్రించడం వారి చేతకాని తనానికి నిదర్శనమన్నారు. ఎన్ని అవరోధాలు కల్పించినా నియోజకవర్గం నుంచి భారీగా పార్టీ శ్రేణులు తరలివెళ్లేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు. మహానాడు విజయవంతమైతే తమ భవిష్యతు శూన్యమవుతుం దన్న అభద్రతాభావం అధికార పార్టీ నాయకుల్లో  కనిపిస్తోందన్నారు. 28వ తేదీ ఉదయం 9 గంటలకు నాయుడుబజారులోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద కేక్‌ కట్‌ చేసి వాహన శ్రేణి బయలుదేరుతుందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమాలు తరలిరావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జునరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి వెంకట సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు షేక్‌ మౌలాలీ, ప్రధాన కార్యదర్శి కొప్పుల శ్రీనివాసులు, కౌన్సిలర్లు యేరువ వెంకట నారాయణరెడ్డి, నాలి కొండయ్య యాదవ్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-27T07:25:24+05:30 IST