భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
కులకచర్ల, మార్చి 27 : పాంబండ ఆలయాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి తెలిపారు. కులకచర్ల బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న అశోక్‌కుమార్ తన తండ్రి తుప్పలి రామయ్య జ్ఞాపకార్థం పాంబండ దేవాలయం వద్ద సొంత డబ్బులతో ముఖద్వారం నిర్మిస్తున్నారు. ఆదివారం ఎమ్మెల్యే ముఖద్వారం నిర్మాణానికి భూమిపూజ చేశారు. జడ్పీటీసీ రాందా్‌సనాయక్, ఆలయ చైర్మన్ రాములు, టీఆర్ఎస్ జిల్లా యువజన నాయకులు అనిల్‌కుమార్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ హరిక్రిష్ణ, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ రాజు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాంరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులున్నారు.
- ‘ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదే’
పరిగి రూరల్, మార్చి 27 :యాసంగిలో రైతులు పండించిన వరి దాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే కె.మహే్‌షరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పరిగి మండల పరిధిలోని రంగంపల్లిలో సర్పంచ్ శ్రీనివా్‌సరెడ్డి అధ్యక్షతన వడ్లు కొనుగోలుపై జరిగిన గ్రామ పంచాయతీ తీర్మానంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రంగంపల్లిలో రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేస్తు ఏకగ్రీవంగా గ్రామ పంచాయతీలో తీర్మానించారు. ఎంపీపీ అరవింద్‌రావు నాయకులు ఆర్.ఆంజనేయులు, ప్రవీణ్‌రెడ్డి, వెంకట్రాంరెడ్డి, సత్యయ్య తదితరులున్నారు.