ఆర్టీసీ బస్టాండ్‌ను ఆధునికీకరిస్తాం

ABN , First Publish Date - 2021-10-17T05:21:18+05:30 IST

మహబూ బ్‌నగర్‌ ఆర్టీసీ బస్టాండ్‌ను ఆధునికీకరిస్తామని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ వి.శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నా రు.

ఆర్టీసీ బస్టాండ్‌ను  ఆధునికీకరిస్తాం
ఎద్దులబండి ప్రతిమతో మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌

- ఆటో పార్కింగ్‌ ఏర్పాటు చేస్తాం

-  మంత్రి డా.వి.శ్రీనివాస్‌గౌడ్‌


మహబూబ్‌నగర్‌ టౌన్‌, అక్టోబరు 16 : మహబూ బ్‌నగర్‌ ఆర్టీసీ బస్టాండ్‌ను ఆధునికీకరిస్తామని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ వి.శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నా రు. శనివారం జిల్లా కలెక్టర్‌తో కలిసి బస్టాండ్‌ పరిస రాలను పరిశీలించారు. ఇక్కడ ఆటోల కోసం పార్కిం గ్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముఖ్మంగా జడ్చర్ల- మహబూనగర్‌ జాతీయ రహదారి విస్తరణలో భాగం గా ప్రస్తుతం కలెక్టర్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఆటో స్టాండ్‌ ఇతర వాహనాల పార్కింగ్‌తో పాటు అప్రోచ్‌ రోడ్డు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని మంత్రి పరిశీలించారు. ఆటోలు నిలుపుకునేందుకు పార్కింగ్‌ ఏర్పాటు చేసి క్రమ పద్ధతిలో నిలుపుకునే ఏర్పాటు చే యాలన్నారు. ఆర్టీసీ డిపోను ఆతర ప్రాంతంలో ఏర్పా టు చేసేందుకు గాను తక్షణమే భూమి కోసం ప్రతిపా దనలు పంపించాలని అధికారులను ఆదేశించారు.  కలెక్టర్‌ వెంకట్రావు ఆర్టీసీ అధికారులు, మునిసిపల్‌ ఇంజనీరు బెంజిమెన్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ మొహి యుద్దీన్‌, తహసీల్దార్‌ పార్థసారథి, జాతీయ రహదారి సంస్థ అధికారులు, మాజీ కౌన్సిలర్‌ కృష్ణమోహన్‌, అధికారులు పాల్గొన్నారు.


ఏడేళ్లలో ఎంతో అభివృద్ధి చేశాం


మహబూబ్‌నగర్‌, అక్టోబరు 16 : ఏడేళ్లలో ఎంతో అభివృద్ధి చేశామని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఏ ప్రభుత్వంలో జరగని అభి వృద్ధి తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతోందని చెప్పా రు. శుక్రవారం పట్టణంలోని బండ్లగేరిలో బండ్లగేరికి చిహ్నంగా రూ. 15 లక్షల వ్యవయంతో నిర్మించిన ఎద్దులబండి ప్రతిమను మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. బండ్లగేరి కులవృత్తు లకు, వ్యవసాయదారులకు, వృత్తి వ్యాపారులు, చిరు ఉద్యోగులకు నిలయమన్నారు. బండ్లగేరిని మరింత అభివృద్ధి చేస్తామని, పాండురంగస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. అదే విధంగా 17వ వార్డులో రూ.10లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ భ వనానికి శంకుస్థాపన చేశారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం వద్ద నూతనంగా నిర్మించిన గార్డు రూమును మంత్రి ప్రారంభించారు. విజయదశమిని పురస్కరించుకుని పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ దేవా లయంలో పూజలు చేశారు. కలెక్టర్‌ ఎస్‌ వెంక ట్రావు, అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, మునిసిప ల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ గణేష్‌, కౌన్సిలర్లు జంగమ్మ, రాము, పద్మజ పాల్గొన్నారు. 


ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయాలి


మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం అక్టోబరు 16 : ఉపాధ్యాయులు అంకితభావం తో పని చేసి మంచి ఫలితాలు తీసుకురావాలని, అప్పుడే వారికి మంచి గుర్తింపు ఉంటుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో హన్వాడ మండలం పరిధిలోని దొర్రి తండా ప్రాథమిక పాఠశాలకు చెందిన నాల్గో తరగతి విద్యార్థులు 25 మంది ఐదో తరగతి గురుకులాలలో ప్రవేశాల కోసం పరీక్ష రాయగా 20 మంది విద్యార్థులు ఎంపికకావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల ఉపాధ్యాయులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతీ పేద విద్యార్థి చదువుకోవాలన్న ఉద్దేశంతో గురుకులాలను ప్రారంభించిందన్నారు. గురుకులాల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన, భోజనం, వసతి సదుపాయం, ఉచితంగా దుస్తులు అందిస్తున్నట్లు తెలిపారు. పేద విద్యార్థులు గురుకులాల్లో సీట్లు సంపాదించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కష్టపడి చదివి విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యంతో ముందుకు సాగితే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఒకే పాఠశాల నుంచి 20 మంది విద్యార్థులు గురుకులాల్లో సీట్లు సాధించడం సంతోషించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్ర మంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పుల్లయ్య,  ఉపాధ్యాయులు మల్లేష్‌  లను మంత్రి పూలమాల శాలువాలతో సన్మానించారు. బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కె.కృష్ణుడు, జిల్లా అధ్యక్షుడు గురుప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి రాజుయాదవ్‌, రాష్ట్ర కోశాధికారి రమేష్‌, రాఘవేందర్‌, జహీర్‌, శివకుమార్‌, గోవిందు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-17T05:21:18+05:30 IST