CM Jagan Assembly: మోటార్లకు మీటర్లపై ఒక్క రూపాయి తీసుకోబోం: జగన్

ABN , First Publish Date - 2022-09-21T22:27:26+05:30 IST

మోటార్లకు మీటర్ల విషయంలో ఒక్క రూపాయి తీసుకోమని సీఎం జగన్ (CM Jagan) స్పష్టం చేశారు. మోటార్లకు మీటర్ల విషయంలో

CM Jagan Assembly: మోటార్లకు మీటర్లపై ఒక్క రూపాయి తీసుకోబోం: జగన్

అమరావతి: మోటార్లకు మీటర్ల విషయంలో ఒక్క రూపాయి తీసుకోమని సీఎం జగన్ (CM Jagan) స్పష్టం చేశారు. మోటార్లకు మీటర్ల విషయంలో వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ఏ ఒక్క రైతు నుంచి రూపాయి కూడా వసూలు చేయలేదని తెలపారు. మోటార్లకు మీటర్ల వల్ల నాణ్యమైన విద్యుత్ను అందిస్తామని ప్రకటించారు. మోటార్లు కాలిపోయే స్థితి నుంచి రైతులను కాపాడుతామని పేర్కొన్నారు. క్వాలిటీ అనేది లేకపోతే రైతు నష్టపోతాడని తెలిపారు. వ్యవసాయంపై శాసనసభలో సీఎం జగన్ ప్రసంగించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై అసెంబ్లీలో చర్చించారు. ఆర్బీకేలతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని జగన్ వివరించారు. ఏపీలో 10,775 ఆర్బీకేలను ఏర్పాటు చేశామన్నారు. నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంక్ (NITI Aayog World Bank), ఆర్బీకేలను ప్రశంసించాయని గుర్తుచేశారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు చెరువులు, వాగులు కళకళలాడుతున్నాయని తెలిపారు. వైసీపీ మూడేళ్ల పాలనలో ఒక్క మండలంలోనూ కరవు లేదని, ఈ మూడేళ్లలో సీమకు అత్యధికంగా నీళ్లు ఇచ్చామని వివరించారు. 


‘‘రుణమాఫీ పేరుతో గత ప్రభుత్వాలు రైతులను మోసం చేశాయి. గత ప్రభుత్వాల తీరుతో మేనిఫెస్టోలకు విలువ లేకుండా పోయింది. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం. వైసీపీ మూడేళ్ల పాలనతో నేతలకు, మేనిఫెస్టోలకు విలువ వచ్చింది. 20.45 లక్షల మంది రైతులకు రూ.1,795 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందించాం. పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ఈ ఒక్క పథకానికే మూడేళ్లలో రూ.27 వేల కోట్లు ఖర్చు చేశాం. ఈ మార్చి నుంచి సాయిల్ డాక్టర్‌ను ప్రారంభిస్తున్నాం. కరువు, చంద్రబాబు ఇద్దరూ కవలలు. ధాన్యం, విత్తనాల సేకరణలో గత ప్రభుత్వ బకాయిలనూ చెల్లించాం. రైతుల సహకారంతో ఏపీలో పంట ప్రణాళిక అమలవుతోంది. గత ప్రభుత్వాల హయాంలో చనిపోయిన 473 రైతు కుటుంబాలకు మేం వచ్చాకే పరిహారం అందించాం. మూడేళ్లలో మరణించిన 308 మంది రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు చొప్పున పరిహారం అందించాం. పాసు పుస్తకం ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నాం ’’ అని జగన్ తెలిపారు.

Updated Date - 2022-09-21T22:27:26+05:30 IST