ప్రభుత్వ భూముల విక్రయాన్ని అడ్డుకుంటాం

ABN , First Publish Date - 2021-06-17T05:45:21+05:30 IST

ప్రభుత్వ భూములు అమ్మాలని చూస్తే కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో అడ్డుకుంటామని డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య పేర్కొన్నారు.

ప్రభుత్వ భూముల విక్రయాన్ని అడ్డుకుంటాం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఈర్ల కొమురయ్య

- డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య

పెద్దపల్లిటౌన్‌, జూన్‌ 16 : ప్రభుత్వ భూములు అమ్మాలని చూస్తే కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో అడ్డుకుంటామని డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య పేర్కొన్నారు. స్థా నిక ఆయన నివాసంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడా రు. ధనిక తెలంగాణ అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్పుల తెలంగాణగా మా ర్చాడన్నారు. రాష్ర్టాన్ని ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో చిన్నాభిన్నం చేశాడ న్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పేదల, గిరిజనులకు ఉచితంగా భూములు పంపిణీ చేసిందని గుర్తుచేశారు. పేదల భూములను లాక్కునే అధికారం ఎవరికి లే దని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉం దన్నారు. ప్రభుత్వ భూములు అమ్మితే దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూమి ఎక్కడ నుంచి ఇస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు వేల కోట్లు అప్పున్న తెలంగాణాలో లక్షల కోట్ల రూపాయలకు చేరింద న్నారు. అధికారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు పేదల భూములు ఆక్రమించుకు న్నారని పార్టీ ఆధ్వర్యంలో ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా చర్యలు తీసుకో కపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ భూములను విక్రయించే ప్రజావ్యతిరేక చర్యల ను మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యలో ఉద్యమా లు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో కడార్ల శ్రీనివాస్‌, విజయ్‌కుమార్‌, సోహె ల్‌, కట్కూరి సందీప్‌, ప్రశాంత్‌, సంతోష్‌, జార్జ్‌ తదితరులున్నారు. 

Updated Date - 2021-06-17T05:45:21+05:30 IST