పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత మాదే: Chandra Babu

ABN , First Publish Date - 2022-07-02T02:03:57+05:30 IST

Amaravathi: పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తమదేనని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. కార్యకర్తలనే కాదు, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని తమకు చేతనైనంత వరకు ఆదుకుంటామని

పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత మాదే: Chandra Babu

Amaravathi:  పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తమదేనని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. కార్యకర్తలనే కాదు, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని తమకు చేతనైనంత వరకు ఆదుకుంటామని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నారాయణ అనే వ్యక్తి తమ పార్టీ కాకపో్యినా ఆ కుటుంబానికి అండగా నిలిచామని చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడడం మంచిది కాదని సీఎం జగన్‌ను పరోక్షంగా హెచ్చరించారు. కొందరు పోలీసులు, పోలీసు ఉన్నతాధికారులు వైసీపీ నేతలు చెప్పినట్లు నడుచుకోవడం మానుకోవాలని సూచించారు. కస్టోడియల్ టార్చర్ నుంచి కస్టోడియల్ మర్డర్స్ చేసే స్థాయిలో కొందరు పోలీసులు ఆలోచన చేస్తున్నారని విమర్శించారు.   

Updated Date - 2022-07-02T02:03:57+05:30 IST