యువతకు ఉపాధి కల్పిస్తాం

ABN , First Publish Date - 2020-11-29T05:12:34+05:30 IST

నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ ఇచ్చి శిక్షణానంతరం ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు బొల్లినేని మెడ్‌స్కిల్స్‌ సెంటర్‌ హెడ్‌ సీహెచ్‌ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

యువతకు ఉపాధి కల్పిస్తాం

బొల్లినేని మెడ్‌స్కిల్స్‌ సెంటర్‌ హెడ్‌ నాగేశ్వరరావు

జీడీఏ కోర్సుల్లో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, నవంబర్‌ 28 :నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ ఇచ్చి శిక్షణానంతరం ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు బొల్లినేని మెడ్‌స్కిల్స్‌ సెంటర్‌ హెడ్‌ సీహెచ్‌ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్‌ పాస్‌,  ఫెయిలైన వారికి జీడీఏ(జనరల్‌ డ్యూటీ అసిస్టెంట్‌) కోర్సుల్లో మూడు నెలల ఉచిత శిక్షణ ఇస్తామని వివరించారు. ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచితంగా వసతి, భోజన సదుపాయం కల్పిస్తామని తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని కోరారు. అలాగే ఇంటర్‌ బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీలో బీఎస్సీ కార్డియాక్‌ కేర్‌, అనస్తీషియాలజీ, ఆప్టోమెట్రిక్‌, ఇమేజింగ్‌, పెర్‌ఫ్యూజన్‌, రీనల్‌ డయాల్సిస్‌, ఎమర్జెన్సీ మెడి సిన్‌, న్యూరో ఫిజియాలజీ, రెస్పిరేటరీ థెరపీ, బీఎస్సీ నర్శింగ్‌, బీఎస్సీ ఎంఎల్‌టీ, బీపీటీ కోర్సులు అందిస్తున్నామని చెప్పారు. ఇది కాకుండా ఇంటర్‌మీడియట్‌లో ఏగ్రూప్‌లో పాసైనా వారికి కూడా 13 డిప్లమో పారామెడికల్‌ కోర్సులతో పాటు జీఎన్‌ఎం కోర్సులు అందిస్తున్నామని వెల్లడించారు. డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులకు రెండు పీజీ కోర్సులు(ఎంహెచ్‌ఏ, పీజీడీఎంఆర్‌హెచ్‌ఐ) అం దుబాటులో ఉన్నాయని వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు 7680945357, 7995013422 నంబర్లను సంప్రదించాలని  ఆయన సూచించారు.  


Updated Date - 2020-11-29T05:12:34+05:30 IST