ప్రజా వేదికను పునర్ణిర్మిస్తాం: బుద్దా వెంకన్న

ABN , First Publish Date - 2022-06-26T00:08:25+05:30 IST

విజయవాడ: ప్రజా వేదిక దగ్గరకు బయలుదేరిన టీడీపీ నేత బుద్దా వెంకన్నను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన జగన్ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం

ప్రజా వేదికను పునర్ణిర్మిస్తాం: బుద్దా వెంకన్న

విజయవాడ: ప్రజా వేదిక దగ్గరకు బయలుదేరిన టీడీపీ నేత బుద్దా వెంకన్నను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన జగన్ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రజా వేదికను తిరిగి నిర్మిస్తామని చెప్పారు. 

జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు

‘‘ప్రజా వేదిక కూల్చి నేటికి మూడేళ్లు అయ్యింది.  చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నిరంతరం పని చేశారు. ప్రజా వేదిక కూల్చివేతతో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం  ప్రారంభించాడు. రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ నిర్మాణం కూడా జరగలేదు. ప్రజా వేదిక సాక్షిగా మా నిరసన తెలపడానికి వెళితే పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు నివాసం వైపు ఎవ్వరిని వెళ్లకుండా దిగ్భంధనం చేశారు. పోలీసులను చట్టపరంగా వారిపనిని వారు చేయనీయడం లేదు. వైసీపీ నేతలు వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ఎండెనక, వాననక రోడ్ల పై పోలీసులు పడిగాపులు పడుతున్నారు. 2024లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం. ప్రజా వేదికను పునర్నిర్మాణం చేస్తాం.’’ అని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.  


    ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్టపై ప్రజా వేదికను నిర్మించారు. చంద్రబాబు ఇంటి పక్కనే ముఖ్యమంత్రి అధికారిక కార్యకలాపాలు, కలెక్టర్ల సమావేశాల కోసం దీని నిర్మాణం జరిగింది. ఇదే ప్రజావేదికలో సీఎం జగన్  చివరి సారిగా కలెక్టర్ల సమావేశం నిర్వహించి.. ఐఏఎస్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నిర్వాకం వల్లే ఇలాంటి నిర్మాణాలు పుట్టుకొస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సమావేశం ముగియగానే ప్రజావేదిక కూల్చివేతకు అక్కడే ఆదేశాలు ఇచ్చారు.

Updated Date - 2022-06-26T00:08:25+05:30 IST