కొవిడ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తాం

ABN , First Publish Date - 2022-01-21T05:21:14+05:30 IST

జిల్లా కేం ద్రంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని కలెక్టర్‌ హరిచందన పేర్కొన్నారు.

కొవిడ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తాం
వీసీలో పాల్గొన్న కలెక్టర్‌ హరిచందన, అదనపు కలెక్టర్‌, డీఎంహెచ్‌వో

- కలెక్టర్‌ హరిచందన

నారాయణపేట టౌన్‌, జనవరి 20 : జిల్లా కేం ద్రంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని కలెక్టర్‌ హరిచందన పేర్కొన్నారు. అదే విధంగా 15 -18 ఏళ్ల వారికి మొదటి డోస్‌ వ్యాక్సినేషన్‌తో పాటు బూస్టర్‌ డోస్‌ వ్యాక్సిన్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అర్హులైన వారికి వందశాతం వ్యాక్సిన్‌ వేసేందుకు చర్యలు చేపడుతామ న్నారు. గురువారం పంచాయతీ రాజ్‌ శాఖ మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి వైద్య, ఆరోగ్య శాఖామంత్రి హరీశ్‌రావు కలెక్టర్లు, డీఎంహెచ్‌వో లతో కొవిడ్‌ నియంత్రణ చర్యలు, తీసుకోవల్సిన జాగ్రత్తలపై వీసీ నిర్వహించారు. వైద్య సిబ్బంది శుక్రవారం నుంచి గ్రామాలు, వార్డుల వారిగా టీంలను ఏర్పాటు చేసి ప్రతి రోజు 25 ఇళ్లలో జర్వ సర్వే నిర్వహించాలన్నారు. సర్వే టీంలో ఆశ వర్కర్‌, ఏఎన్‌ఎం, పుర, పంచాయతీ సిబ్బంది ఉంటారని వీరు ఇంటింటికి వెళ్లి కొవిడ్‌ లక్షణాల తో బాధపడుతున్న వారికి హోం ఐసోలేషన్‌ కిట్‌ ఇవ్వాలన్నారు. ప్రతిరోజు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని, ఐదు రోజుల తర్వాత దగ్గర్లోని ఆసుపత్రుల్లో చేర్పించాలన్నారు. పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మా ట్లాడుతూ కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రామానికి ఒక నోడల్‌ ఆఫీసర్‌ను నియమించాలన్నారు. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ మాట్లాడుతూ కొవిడ్‌తో మృతి చెందిన వారికి ప్రభుత్వం చెల్లించే ఆర్థిక సహాయాన్ని త్వరగా మంజూరు చేయాలని కలెక్టర్లను ఆదేశిం చారు. వీసీలో అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, డీఎంహెచ్‌వో మనోహర్‌రావు, డాక్టర్‌ శైలజ, డీపీవో మురళి పాల్గొన్నారు.


Updated Date - 2022-01-21T05:21:14+05:30 IST