ఎన్టీఆర్‌ జోలికి వస్తే సత్తా చూపుతాం: టీడీపీ

ABN , First Publish Date - 2022-09-24T06:35:47+05:30 IST

ఎన్టీఆర్‌ జోలికి వస్తే తెలుగు తమ్ముళ్ల సత్తా చూపుతామని టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ నగర పంచాయతీ వైస్‌ చైర్మన్‌ రామాంజనేయులు హెచ్చరించారు.

ఎన్టీఆర్‌ జోలికి వస్తే సత్తా చూపుతాం: టీడీపీ
సి.బెళగల్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న టీడీపీ నాయకులు

గూడూరు, సెప్టెంబరు 23: ఎన్టీఆర్‌ జోలికి వస్తే తెలుగు తమ్ముళ్ల సత్తా చూపుతామని టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ నగర పంచాయతీ వైస్‌ చైర్మన్‌ రామాంజనేయులు హెచ్చరించారు. శుక్రవారం కోడుమూరు నియోజక వర్గం మాజీ టీడీపీ ఇన్‌చార్జి విష్ణువర్ధన్‌ రెడ్డి ఆదే శాల మేరకు టీడీపీ నాయ కుడు, మాజీ వైస్‌ చైర్మన్‌ రామాంజనే యులు ఆధ్వర్యంలో గూడూరు పట్ట ణంలో ఎన్టీఆర్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి క్షీరాభిషేకం చేసారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మా ట్లాడుతూ హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించడం సరి కాదని, తక్షణం చేసిన తప్పును సరిదిద్దుకో వాలని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్లు రేమట సురేష్‌, బుడం గళి, టీడీపీ నాయకులు రేమట వెంకటేశ్వర్లు, జె సురేష్‌, సృజన్‌, కోడుమూరు షాషావళి, గుడిపాడు మహేశ్వర రెడ్డి, నరసింహులు, పౌలు, గౌండ కుమార్‌, హనుమంతు, విజయ్‌కుమార్‌, వీర కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


జగన్‌కు పతనం తప్పదు: టీడీపీ

సి. బెళగల్‌:
తెలుగు జాతిని అవమానించిన జగన్‌కు పతనం తప్పదని టీడీపీ మాజీ మండల కన్వీనర్‌ బీఎస్‌ చిన్న తిమ్మప్ప అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎన్టీఆర్‌ పార్కులో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం టీడీపీ మాజీ మండల కన్వీనర్‌ బీఎస్‌ తిమ్మప్ప మా ట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ హెల్త్‌ వర్సిటీ పేరు తొలగించడం దారు ణమన్నారు. 1996 లో హెల్త్‌ వర్సీటీ ఏర్పాటు చేసిన హెల్త్‌వర్సీటీకీ వైఎస్‌కు సంబంధం ఏమిటీ అని ప్రశ్నించారు. కార్యక్రమంలో బాలజీ వెంకటేశ్‌, బురాన్‌దొడ్డి వెంకటప్ప, ధనుంజయుడు, గుండన్న, కొండన్న, కర్రెతాత, కర్రెన్న, శరత్‌, వెంకటేశ్వర్లు గౌడు, ఎంపీటీసీలు, సర్పంచులు ఉన్నారు.


Updated Date - 2022-09-24T06:35:47+05:30 IST