తిరుమలగిరి రోడ్లపై నిలిచిన వరద నీటిని ఎక్స్కవేటర్ సాయంతో కాలువ తీయించి బయటికి పంపుతున్న చైర్పర్సన్ రజని తదితరులు
తిరుమలగిరి, జూన్ 27: పట్టణంలో సమస్య లను పరిష్కరిస్తామని మునిసిపల్ చైర్పర్సన్ రజని, మునిసిపల్ కమిషనర్ దండు శ్రీను అన్నారు. చినుకు పడితే అంతే’ శీర్షికన ‘ఆంధ్ర జ్యోతి’లో సోమవారం ప్రచురితమైన వార్తకు మునిసిపల్ అధికారులు స్పందించారు. మునిసిపాలి టీలో వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో సోమవారం పర్యటించారు. వార్డుల్లో నిలిచిన వరద నీటిని ఎక్స్కవేటర్ల సాయంతో కాల్వలు తీసి తొలగించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రజని మాట్లాడుతూ వార్డులో డ్రైనేజీ, రోడ్ల సమస్యలను గుర్తించామని, సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని ఆమె తెలిపారు.