ప్రొబేషన్‌ నిలిపేస్తాం

Published: Thu, 23 Jun 2022 00:26:10 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 ప్రొబేషన్‌ నిలిపేస్తాం సచివాలయాన్ని తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ సూర్యకుమారి


సక్రమంగా పనిచేయకపోతే చర్యలు
సచివాయలం సిబ్బందితో కలెక్టర్‌

గంట్యాడ, జూన్‌ 22:
‘పని చేయడం ఇష్టం లేకపోతే ఉద్యోగం మానేసి వేరే పని చూసుకోండి.. సక్రమంగా పనిచేయకపోతే ప్రొబేషన్‌ నిలిపేస్తాం’ అని కలెక్టర్‌ సూర్యకుమారి హెచ్చరించారు. పెణసాం, బుడతనాపల్లి గ్రామ సచివాలయాలను ఆమె బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్బంగా సిబ్బంది వారీగా నివేదికలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది మధ్య సమన్వయంలోపం ఉన్నట్లు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్యోగం అంటే పులిపై స్వారీ లాంటిదని, బాధ్యతగా పని చేసి ప్రజలకు చక్కని సేవలు అందించాలని ఆదేశించారు. ఒకవేళ ఉద్యోగం చేయడం ఇష్టంలేకపోతే మానేసి వెళ్లిపోవాలని, మరోసారి సమన్వయలోపం పునరావృతం కాకూడదని హెచ్చరించారు. పదో తరగతి ఉత్తీర్ణలైన విద్యార్థులకు కుల, ఆదాయ, నివాస ధ్రువ పత్రాలను సకాలంలో మంజూరు చేయాలని సిబ్బందికి ఆదేశించారు. రైతులు వేసిన పంటలకు ఈ-క్రాప్‌లో నమోదై ఉండాలన్నారు. వలంటీర్లకు యోగా నేర్పాలని సచివాలయం సిబ్బందికి ఆదేశించారు. సచివాలయం, వెల్‌నెస్‌, రైతు భరోసా కేంద్రాల భవనాలు వెంటనే పూర్తి చేయాలని స్థానిక ప్రజా ప్రతినిధులకు సూచించారు. సిమెంట్‌ ఇవ్వడం లేదని సర్పంచ్‌, ఎంపీటీసీ సభ్యులు కలెక్టరు దృష్టికి తీసుకెళ్లాగా రెండు రోజులుల్లో వస్తుందని, వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామంలో నిర్మిస్తున్న సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను పరిశీలించారు. ఆమె వెంట తహసీల్దార్‌ ప్రసన్న రాఘవ, ఎంపీడీవో నిర్మలాదేవి, పీఆర్‌జేఈ కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.