వరద బాధితులను ఆదుకుంటాం : మంత్రి

Jul 27 2021 @ 00:00AM
కాల్వలో నిమ్మతోటను పరిశీలిస్తున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

దిలావర్‌పూర్‌, జూలై 27 : భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బా ధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని దేవాదాయ, అటవీ, న్యాయ శా ఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం కా ల్వ గ్రామ శివారులో స్వర్ణ వాగు ఉధృతికి దెబ్బతిన్న పొలాలను పరిశీలించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వర్షాలు కురువడంతోనే తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. అధికారులు పంట నష్టం అం చనా వేసే పనిలో ఉన్నారని, నివేదిక రాగానే ప్రభుత్వం చర్యలు చేపడుతుం దని అన్నారు. రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్‌ వెంకట్రామ్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, జడ్పీకోఆప్షన్‌ సభ్యుడు సుభాష్‌ రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ రమణారెడ్డి, వైస్‌ ఎంపీపీ బాపురావు తదితరులు పాల్గొన్నారు.
పట్టణ శుభ్రతకు ప్రాధాన్యం..
నిర్మల్‌ కల్చరల్‌: జిల్లా కేంద్రం అభివృద్ధిలో భాగంగా పట్టణ శుభ్రతకు ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవా రం ఆయన రోడ్డు శుభ్రం చేసే వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ యంత్రం ద్వా రా రోడ్లు ఊడ్చి రహదారులు శుభ్రంగా కనబడతాయన్నారు. ఒక్కో వాహ నం 40 లక్షల రూపాయలతో సమకూర్చామని, 70 హెచ్‌పీ కెపాసిటీ ఇంజ న్‌ 9 వేల లీటర్ల సేకరణతో గంటకు ఆరు కిలోమీటర్లు శుభ్రం చేయగల సామర్ధ్యం ఉందని తెలిపారు. జిల్లాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే వి ధంగా సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయని అన్నారు. రోడ్లు, మురికి కాలువల నిర్మాణాలు, మరమ్మతులు వేగవంతం చేశామన్నారు. కలెక్టర్‌ ము షారఫ్‌ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, కమిషనర్‌ బా లకృష్ణ, కౌన్సిలర్‌ నేరెళ్ల వేణు, అయ్యన్నగారి రాజేందర్‌, ఎడపల్లి నరేందర్‌, నాయకులు రాంకిషన్‌ రెడ్డి, అడపా పోశెట్టి పాల్గొన్నారు.
నేడు నీటి విడుదల
సోన్‌: మండలలోని గాంధీనగర్‌ గ్రామం వద్ద బుధవారం ఉదయం 8:30 గంటలకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సరస్వతి కెనాల్‌కు నీటిని విడుద ల చేయనున్నట్లు జల వనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్‌ సుశీల్‌దేశ్‌పాండే, ఈఈ రామారావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం వారు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. సరస్వతి కెనాల్‌ ఆయకట్టు పరిధిలో ఉన్న రైతు లు కాలువలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కెనాల్‌ కింద 36 వేల ఎకరాల వరకు పంట సాగు అవుతుందని తెలిపారు. రైతులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీటిని వృ థా చేయకుండా చూసుకోవాలని తెలిపారు.

Follow Us on: