‘గిరిజనులను అన్ని విధాలుగా ఆదుకుంటాం’

ABN , First Publish Date - 2021-03-08T05:40:19+05:30 IST

దేవుపల్లి మదుర గ్రామం కొండవానిపాలెంలో అగ్ని ప్రమాదంలో నిరాశ్రాయులైన గిరిజన బాధితులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని పార్వతీపురం ఐటీడీఏ ఏపీవో ఎ.సురేష్‌ చెప్పారు.

‘గిరిజనులను అన్ని విధాలుగా ఆదుకుంటాం’

బొండపల్లి, మార్చి 7: దేవుపల్లి మదుర గ్రామం కొండవానిపాలెంలో అగ్ని ప్రమాదంలో నిరాశ్రాయులైన గిరిజన బాధితులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని పార్వతీపురం ఐటీడీఏ ఏపీవో ఎ.సురేష్‌ చెప్పారు. ఆయన ఆదివారం ఆ గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించి, వంట సామగ్రి పంపిణీ చేశారు. బాధితులకు పక్కా ఇళ్లతో పాటు సహాయక చర్యలు చేపడతామని  చెప్పారు. గంట్యాడ మండలం బుడతనాపల్లి గ్రామానికి చెందిన ఆర్యవైశ్య సం ఘం సభ్యులు మాటూరి అప్పలరాజు, దుప్పట్లు స్టీలు సామగ్రి పంపిణీ చేశారు.  గజపతినగరం గాయత్రీ క్లాత్‌స్టోర్‌ యజమాని బండారు ప్రసాద్‌ దుస్తులను పంపిణీ చేశారు. జీపీ అగ్రహారం సిరిపరపు నాయుడుబాబు దుస్తులు, వంట సామగ్రిని అందజేశారు. గొల్లుపాలెం గ్రామ సర్పంచ్‌ పోతల రమణమ్మ, మాజీ సర్పంచ్‌ పల్లి రామునాయుడు ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎన్‌.సీతారామరాజు, మాజీ ఎంపీపీ రాపాక సూర్యప్రకాష్‌, పలువురు నాయకులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-03-08T05:40:19+05:30 IST