ఇంటి నుంచే పని చేస్తాం

ABN , First Publish Date - 2020-09-23T05:44:21+05:30 IST

హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడానికే మొగ్గు చూపు తున్నారు. పెద్ద కంపెనీల్లోని ఉద్యోగులు అధిక శాతం ఇంటి నుంచే పని చేస్తున్నారని హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (

ఇంటి నుంచే పని చేస్తాం

90% ఐటీ ఉద్యోగుల అభిమతం

 హైసియా అధ్యయన నివేదిక 


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడానికే మొగ్గు చూపు తున్నారు. పెద్ద కంపెనీల్లోని ఉద్యోగులు అధిక శాతం ఇంటి నుంచే పని చేస్తున్నారని హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020-21లో హైదరాబాద్‌  ఐటీ పరిశ్రమ ఆదాయం, లాభదాయకత వృద్ధిరేటు ఒక అంకెకు పరిమితం కావచ్చునని లేదా మార్పులేకుండా ఉండవచ్చని అంచనా వేసింది. కొవిడ్‌ కేసుల  తగ్గుదల.. వ్యాక్సిన్‌ లభ్యత ఆధారంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వచ్చే అంశాన్ని నిర్ణయించగలమని హైసియా ప్రెసిడెంట్‌ భరణి కుమార్‌ తెలిపారు. 

             

అధ్యయనంలోని ముఖ్యాంశాలు..


ఉద్యోగుల ఉత్పాదకత 75ు పైగా ఉందని 80ు కంపెనీలు పేర్కొన్నాయి. దాదాపు అన్ని పెద్ద కంపెనీలు ఉద్యోగుల ఉత్పాదకత 90 శాతానికి పైగా ఉందని చెప్పాయి. 


బ్రాడ్‌బ్యాండ్‌ లభ్యత, పవర్‌ కట్‌, పని వాతావరణం డబ్లుఎఫ్‌హెచ్‌కి ప్రధాన ప్రతిబంధకాలుగా ఉన్నాయి. ఉద్యోగుల్లో నైతిక స్థైర్యం తక్కువగా ఉందని 34 శాతం కంపెనీలు వెల్లడించాయి.


వచ్చే ఏడాది మార్చి తర్వాత కూడా 70-89 శాతం ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయించేందుకే 31 శాతం కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. పెద్ద కంపెనీలు చాలా తక్కువ శాతం మాత్రమే ఇంటి నుంచి పని 30 శాతానికి పరిమితం చేయాలను కుంటున్నాయి.


దాదాపు 70 శాతం పెద్ద కంపెనీలు గత ఆరు నెలల్లో ఫ్రెషర్లను ఉద్యోగాల్లో చేర్చుకున్నాయి. అధిక శాతం కంపెనీలు ఫ్రెషర్లకు ఇచ్చిన ఆఫర్‌ లెటర్లను ఆనర్‌ చేస్తామని చెబుతున్నాయి.


2021-22లో ప్రాంగణ నియామకాలు కొవిడ్‌ ముందు స్థాయికి రాగలవని 50 శాతం పెద్ద కంపెనీలు పేర్కొన్నాయి. 


Updated Date - 2020-09-23T05:44:21+05:30 IST