ప్రభుత్వ వైద్యశాలలో కాన్పులు జరిగేలా చూడాలి

ABN , First Publish Date - 2021-07-28T04:34:13+05:30 IST

ప్రభుత్వ వైద్యశాలలో కాన్పులు జరిగేలా చూడాలని డీఎంహెచ్‌ఓ మనోహర్‌ వైద్య సిబ్బందికి సూచించారు. మంగళవారం స్థానిక వైద్యశాలను ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు.

ప్రభుత్వ వైద్యశాలలో కాన్పులు జరిగేలా  చూడాలి
మాట్లాడుతున్న డీఎంహెచ్‌ఓ మనోహర్‌

వాంకిడి, జూలై 27: ప్రభుత్వ వైద్యశాలలో కాన్పులు జరిగేలా చూడాలని డీఎంహెచ్‌ఓ మనోహర్‌ వైద్య సిబ్బందికి సూచించారు. మంగళవారం స్థానిక వైద్యశాలను ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యశాలలో అందిస్తున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యసిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మాతా శిశు సంరక్షణ సేవలను అర్హులకు అందెలా చూడాలని సూచించారు. హైరిస్క్‌ గ ర్భిణులను గుర్తించి వారికి కావల్సిన వైద్యసేవలను, 102, 108 అవ్వల్‌ వాహనాలను అందుబాటులో ఉంచాలన్నారు. గర్భిణి నమోదు నుండి  కాన్పు అయ్యేంత వరకు వారిని చుసుకునే బాద్యత వైద్యసిబ్బంది, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలపై ఉందన్నారు.  హై రిస్క్‌ గర్భిణులను గుర్తించి వారికి కావాల్సిన వైద్య౉ సవలను అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో డీప్యూటీ డీఎం హెచ్‌ఓ సుధాకర్‌ నాయక్‌, వైద్యాధికారి సతీష్‌, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-28T04:34:13+05:30 IST