hijab: నేను హిజాబ్ ధరించను...ఇరాన్ అధ్యక్షుడికి మహిళా జర్నలిస్ట్ షాక్

ABN , First Publish Date - 2022-09-23T16:29:41+05:30 IST

ఇరాన్ దేశంలో హిజాబ్‌పై(hijab) వివాదం రాజుకున్న నేపథ్యంలో ఓ మహిళా జర్నలిస్టు సాక్షాత్తూ ఇరాన్(Iran) దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీకి (Ebrahim Raisi)షాక్ ఇచ్చారు....

hijab: నేను హిజాబ్ ధరించను...ఇరాన్ అధ్యక్షుడికి మహిళా జర్నలిస్ట్ షాక్

న్యూయార్క్: ఇరాన్ దేశంలో హిజాబ్‌పై(hijab) వివాదం రాజుకున్న నేపథ్యంలో ఓ మహిళా జర్నలిస్టు సాక్షాత్తూ ఇరాన్(Iran) దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీకి (Ebrahim Raisi)షాక్ ఇచ్చారు. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో ప్రసంగించేందుకు ఇబ్రహీం రైసీ న్యూయార్క్ నగరానికి వచ్చారు.ఈ సందర్భంగా యూఎస్ ఇరానీయన్ అయిన సీఎన్ఎన్ చీఫ్ ఇంటర్నేషనల్ యాంకర్ క్రిస్టియానా అమన్‌పూర్‌కు(Christiane Amanpour) ఇంటర్వ్యూ(interview) ఇచ్చేందుకు ఇరాన్ అధ్యక్షుడు రైసీ(interview with Iran President) అంగీకరించారు. అయితే ఇంటర్వ్యూకు ముందు జుట్టును హిజాబ్‌తో(hijab) కప్పి ఉంచుకోవాలని ఇరాన్ అధ్యక్షుడి సహాయకురాలు క్రిస్టియానాకు ఆదేశించింది.




దీంతో నేను హిజాబ్ ధరించను అని జర్నలిస్ట్ క్రిస్టియానా స్పష్టం చేసింది.హిజాబ్ ధరించకుంటే ఇంటర్వ్యూ జరగదని అధ్యక్షుడి సహాయరాలు స్పష్టం చేశారు. హిజాబ్ ధరించనని జర్నలిస్ట్ చెప్పడంతో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం ఇంటర్వ్యూ ఇవ్వకుండానే వెళ్లిపోయారు.దీంతో జర్నలిస్ట్ క్రిస్టియానా ట్వీట్‌లతో(tweet) పాటు, ఇరాన్ ప్రెసిడెంట్ రైసీ ఇంటర్వ్యూ కోసం ఉంచిన ఖాళీ కుర్చీ ముందు హిజాబ్ లేకుండా కూర్చున్న తన చిత్రాన్ని పోస్ట్ చేసింది.‘‘నన్ను హిజాబ్ ధరించాలని కోరితే దాన్ని మర్యాదగా తిరస్కరించాను. మేం న్యూయార్క్‌లో ఉన్నాం, ఇక్కడ హిజాబ్ కు సంబంధించి ఎలాంటి చట్టం లేదా సంప్రదాయం లేదు’’ అని బ్రిటిష్-ఇరానియన్ జర్నలిస్ట్ ట్విట్టర్‌లో రాశారు.


నేను ఇరాన్ వెలుపల వారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు మునుపటి ఇరాన్ అధ్యక్షులెవరూ హిజాబ్ ధరించాల్సిన అవసరం లేదనే విషయాన్ని తాను ఎత్తి చూపానని క్రిస్టియానా చెప్పారు.హిజాబ్ పై ఇరాన్ దేశంలో నిరసనలు సాగుతున్న(Iran Anti-Hijab Protests) నేపథ్యంలో న్యూయార్క్ లో సాక్షాత్తూ ఇరానియన్ మహిళా జర్నలిస్ట్ ఇరాన్ దేశ అధ్యక్షుడికే ఝలక్ ఇచ్చింది. 




Updated Date - 2022-09-23T16:29:41+05:30 IST