Weather information: చురుగ్గా రుతుపవనాలు.. కోస్తాకు వర్షసూచన

ABN , First Publish Date - 2022-07-23T00:50:49+05:30 IST

పశ్చిమ తీరంలో ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా కర్ణాటక (Karnataka) నుంచి తమిళనాడు

Weather information: చురుగ్గా రుతుపవనాలు.. కోస్తాకు వర్షసూచన

విశాఖపట్నం: పశ్చిమ తీరంలో ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా కర్ణాటక (Karnataka) నుంచి తమిళనాడు వరకు మరో ద్రోణి విస్తరించిందని ప్రకటించింది. ఇదే సమయంలో బంగాళాఖాతం నుంచి కోస్తాపైకి తేమగాలులు వీస్తున్నాయని తెలిపింది. వీటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో శుక్రవారం కోస్తాలో అనేకచోట్ల ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయని తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తాలో ఎక్కువచోట్ల, రాయలసీమ (Rayalaseema)లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు పడతాయని, ఆ తరువాత రెండు, మూడు రోజులు కూడా అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా శుక్రవారం కోస్తా, రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు నుంచి ఏడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. విశాఖ ఎయిర్‌పోర్టులో 32.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

Updated Date - 2022-07-23T00:50:49+05:30 IST