వెబ్‌కామ్‌ సమస్యకు పరిష్కారం!

ABN , First Publish Date - 2022-06-11T05:51:17+05:30 IST

కీబోర్డ్‌, మౌస్‌ మాదిరిగానే ఈ రోజుల్లో వెబ్‌క్యామ్‌ తప్పనిసరి యాక్సెసరీగా మారింది.

వెబ్‌కామ్‌ సమస్యకు పరిష్కారం!

కీబోర్డ్‌, మౌస్‌ మాదిరిగానే ఈ రోజుల్లో వెబ్‌క్యామ్‌ తప్పనిసరి యాక్సెసరీగా మారింది. అలాగే ల్యాప్‌టాప్‌ పై వెబ్‌క్యామ్‌ ఉంచుకుని వివిధ సమావేశాల నుంచి ప్రాజెక్టులకు సంబంధించి పనుల వరకు రియల్‌ టైమ్‌లో పూర్తికానిస్తున్న సంగతి విదితమే. అయితే మేక్‌బుక్‌ ల్యాప్‌టాప్స్‌ సహా వెబ్‌క్యామ్‌ల్లో పూర్‌ క్వాలిటీ ఇబ్బంది పెడుతోంది. దీన్ని పరిష్కరించే పనికి యాపిల్‌ పూనుకుంది. ఎం2మేక్‌బుక్స్‌తో 1080 పి వెబ్‌క్యామ్‌ను ప్రత్యామ్నాయం పరిచయం చేసింది. కంటిన్యుటి కెమెరాగా ఉపయోగపడనుంది. పాత మ్యాక్‌ ఉన్న వాళ్ళు ఐఫోన్‌ను వెబ్‌క్యామ్‌గా ఉపయోగించుకునేందుకు అనుమతించింది.


యాపిల్‌ తన కీనోట్‌లో మౌంటింగ్‌ క్లిప్‌ని చూపింది. మేక్‌పై ఐఫోన్‌ని పెట్టుకుని వెబ్‌క్యామ్‌గా ఉపయోగించుకోవచ్చు. కెమెరాను కదపకుండానే డెస్క్‌ వ్యూని ప్రొజెక్ట్‌ చేసుకోవచ్చు. వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ను కూడా ఉపయోగించవచ్చని  భావిస్తున్నారు. అయితే ఈ ఏడాది చివర్లో ఆపరేటింగ్‌ సిస్టమ్‌ విడుదలైన తరవాత ఒకసారి టెస్ట్‌ చేయాల్సి ఉంది. ఆండ్రాయిడ్‌లో పెట్టుకున్న మూడో పార్టీ యాప్స్‌ని కూడా వెబ్‌క్యామ్‌గా తమ ఫోన్లు ఉపయోగించి వాడుకోవచ్చు. ఐఫోన్‌ని వెబ్‌క్యామ్‌గా ఉపయోగించుకుంటున్న సమయంలో అందులోని సెట్టింగ్స్‌ అంటే బ్రైట్‌నెస్‌ పెంపు, బ్యాక్‌గ్రౌండ్‌ను డార్క్‌లో ఉంచుకోవడం వంటి ఫీచర్స్‌ని కూడా వాడేసుకోవచ్చు. ఫేస్‌టైమ్‌ అలాగే ఇతర యాప్స్‌ అంటే జూమ్‌ల్లో ఐఫోన్‌ వెబ్‌క్యామ్‌ మాదిరిగా ఉపయోగపడుతుంది. కంటిన్యూటీ కెమెరా ఇంకో ఫీచర్‌. యాపిల్‌ దీన్ని అన్ని ప్లాట్‌ఫారాల్లో వినియోగించుకోవచ్చు. ఫేస్‌టైమ్‌ కాల్‌లో వివిధ డివైస్‌ల మధ్య జంప్‌ చేసేందుకు ఇది వీలుకలిగిస్తుంది. అంటే హ్యాంగింగ్‌ లేకుండానే ఐఫోన్‌ నుంచి మేక్‌కు ఫేస్‌టైమ్‌ కాల్‌ని మూవ్‌ చేసుకోవచ్చు. 

Updated Date - 2022-06-11T05:51:17+05:30 IST