Ukrain యుద్ధభూమిలో పెళ్లి గంటలు...

ABN , First Publish Date - 2022-03-07T12:30:30+05:30 IST

రష్యా భీకర కాల్పుల మధ్య ఉక్రెయిన్ యుద్ధభూమిలో పెళ్లి గంటలు మోగాయి....

Ukrain యుద్ధభూమిలో పెళ్లి గంటలు...

ఇద్దరు సైనికుల వివాహం

కైవ్: రష్యా భీకర కాల్పుల మధ్య ఉక్రెయిన్ యుద్ధభూమిలో పెళ్లి గంటలు మోగాయి. ఒక వైపు రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రేనియన్ 112 బ్రిగేడ్‌కు చెందిన సైనికులు లెస్యా, వాలెరీలు యుద్ధభూమిలోనే వివాహం చేసుకున్నారు. ఉక్రెయిన్ దేశంపై రష్యా కాల్పులు జరుపుతున్నా, కాల్పుల మోత మధ్య ఉక్రేనియన్ యోధులైన లెస్యా, వాలెరీలు సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. ఉక్రెనియా సైన్యంలో పనిచేస్తున్న లెస్యా, వాలెరీలు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వరుడు యూనిఫాం ధరించి వివాహం ఆడారు. వధువు పుష్పగుచ్ఛం పట్టుకొని వరుడితో కలిసి హెల్మెట్లు మార్చుకున్నారు.ఒకవైపు వివాహం సాగుతుండగా, మరో వైపు రష్యా సైనికులు విన్నిట్సియా విమానాశ్రయాన్ని ధ్వంసం చేశారు.గత వారం మరో జంట క్లెవెట్స్, నటాలియా వ్లాడిస్లేవ్ ఉక్రెయిన్‌లోని ఒడెస్సా నగరంలోని బాంబు షెల్టర్‌లో వివాహం చేసుకున్నారు.


Updated Date - 2022-03-07T12:30:30+05:30 IST