పెళ్లి వేడుక

ABN , First Publish Date - 2022-07-03T18:03:24+05:30 IST

పెంపుడు జంతువులు చేసే వింత చేష్టలన్నీ ముచ్చటగానే ఉంటాయి. వాటిని వీడియో తీసి సరదాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు

పెళ్లి వేడుక

పెంపుడు జంతువులు చేసే వింత చేష్టలన్నీ ముచ్చటగానే ఉంటాయి. వాటిని వీడియో తీసి సరదాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు చాలామంది. ఆ వీడియోలు సహజంగానే అందర్నీ ఆకట్టుకుంటాయి. పెట్స్‌తో గడపడమే కాదు... వాటి వీడియోలు చూస్తే కూడా ఒత్తిడి దూరమవుతుందంటారు మానసిన విశ్లేషకులు. కొన్నిసార్లు అవి చేసే పనులు వినోదాన్నిస్తాయి. 

ఈ ఫొటోలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? సాంప్రదాయ క్రైస్తవ పద్ధతుల్లో రెండు పెట్స్‌ వివాహం చేసుకుంటున్నాయి. వధువు శునకంగారు ఎంత అందంగా ముస్తాబయ్యిందో చూడండి. తలనిండా పూలు పెట్టుకుని, తెల్లటి పెళ్లి గౌను ధరించి చూడ ముచ్చటగా ఉంది కదూ. వరుడు కూడా తక్కువ తినలేదు. పెళ్లి సూట్‌లో మెరిసి పోతున్నాడు. ‘హే మై నేమ్‌ ఈజ్‌ లూనా’ పేరిట ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ పెళ్లి వీడియో తెగ వైరల్‌ అవుతోంది. వాటి పెళ్లిని ఒక పెద్దావిడ సాంప్రదాయ పద్ధతుల్లో చేస్తోంది. వీడియోలో వధువును వరుడు ముద్దాడటం కూడా చూడొచ్చు. ‘మోస్ట్‌ క్యూటెస్ట్‌ కపుల్‌’ అంటూ పొగడ్తలు వెల్లువెత్తుతుంటే... ఇప్పటికే ఈ వీడియోకు నాలుగు లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. 

Updated Date - 2022-07-03T18:03:24+05:30 IST