పాపం.. గుర్రం ఎంత పని చేసింది.. వరుడికి చుక్కలు చూపించింది..!

Jul 24 2021 @ 11:40AM

గుర్రం ఎక్కి దర్జాగా పెళ్లి మండపానికి ఊరేగింపుగా వెళ్తున్నాడు.. బంధువులు, స్నేహితులు ఎంతో ఉత్సాహంతో నృత్యాలు చేస్తూ వరుడిని మండపానికి తీసుకెళ్తున్నారు.. మధ్యలో బాణాసంచా కాల్చారు.. ఆ శబ్దాలకు గుర్రం భయపడింది.. పరుగులు పెట్టింది.. అలా నాలుగు కిలో మీటర్ల వరకు వరుడిని తీసుకెళ్లిపోయింది.. రాజస్థాన్‌లోని అజ్మీర్‌ జిల్లా రాంపుర గ్రామంలో ఈ ఘటన తాజాగా జరిగింది.

 

తన స్వగ్రామమైన రాంపుర నుంచి పెళ్లి మండపం ఉన్న నసీరాబాద్‌కు వరుడు గుర్రంపై ఊరేగింపుగా బంధుమిత్రులతో కలిసి బయల్దేరాడు. ఘనంగా జరుగుతున్న ఆ ఊరేగింపు మధ్యలో బాణాసంచా కాల్చారు. భారీ శబ్దం రావడంతో గుర్రం అదిరిపోయి పరుగులు పెట్టేసింది. దీంతో బంధువులంతా కంగారు పడ్డారు. గుర్రాన్ని ఆపేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. అలా ఏకంగా నాలుగు కిలోమీటర్లు పరిగెట్టాక గుర్రం ఆగింది. అయితే ఆ వరుడు క్షేమంగానే ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చివరకు వరుడు మండపానికి చేరుకుని వధువు మెడలో తాళి కట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...