ఆహా.. అనేలా వివాహ ఆహ్వాన పత్రిక!

ABN , First Publish Date - 2022-02-11T09:06:45+05:30 IST

పెళ్లి అనేది ఓ మధుర జ్ఞాపకం. మరి అలాంటి తంతుని సాదాసీదాగా కానిచ్చేస్తే మజా ఏం ఉంటుంది!

ఆహా.. అనేలా వివాహ ఆహ్వాన పత్రిక!

సింహాచలం, ఫిబ్రవరి 10: పెళ్లి అనేది ఓ మధుర జ్ఞాపకం. మరి అలాంటి తంతుని సాదాసీదాగా కానిచ్చేస్తే మజా ఏం ఉంటుంది! అందుకే ఆహ్వాన పత్రికల దగ్గర నుంచి విందు భోజనాల వరకూ ఏదో ఒక ప్రత్యేకత చాటాలని చాలామంది కోరుకుంటుంటారు. విశాఖ నగరంలోని 98వ వార్డు తెలుగు మహిళ మాజీ అధ్యక్షురాలు లొడగల వరలక్ష్మి, రామకృష్ణ దంపతులు కూడా అలాగే ఆలోచించారు. తమ కమార్తె పెళ్లి శుభలేఖను విమాన టికెట్‌ తరహాలో తయారు చేయించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఫ్లైట్‌ టికెట్‌లో సమాచారం మాదిరిగా శుభలేఖలో వివాహ తేదీ, ముహూర్తసమయం, విందు వంటి వివరాలను తెలియజేశారు. కరోనా కాలం కదా.. పెళ్లికి వచ్చినవారు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కూడా సూచించారు.



Updated Date - 2022-02-11T09:06:45+05:30 IST