పెళ్లింట విషాదం

ABN , First Publish Date - 2022-05-14T04:18:06+05:30 IST

మరో ఐదు రోజుల్లో పెళ్లి బాజాలు, బంధు వులతో కళకళలాడాల్సిన ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలు ముకొంది. కూతురు వివాహా పత్రికలు బంధువులకు ఇచ్చేందుకు వెళ్తుండగా ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో తండ్రి మృతి చెందగా పలువురికి గాయాలైన ఘటన శుక్రవారం కోటపల్లి మండలంలో చోటు చేసుకుంది. పిన్నారం గ్రామానికి చెందిన తుంగ రాజ పోచం(48) రెండో కూతురు మనీషా వివాహాన్ని ఈ నెల 20న జరిపేందుకు ముహూర్తం నిర్ణయించారు.

పెళ్లింట విషాదం
తుంగ రాజపోచం(ఫైల్‌)

అదుపు తప్పి ఆటో బోల్తా

కూతురు పెండ్లి కార్డులు ఇచ్చేందుకు వెళుతూ తండ్రి మృతి

కోటపల్లి, మే 13: మరో ఐదు రోజుల్లో పెళ్లి బాజాలు, బంధు వులతో కళకళలాడాల్సిన ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలు ముకొంది. కూతురు వివాహా పత్రికలు బంధువులకు ఇచ్చేందుకు వెళ్తుండగా ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో తండ్రి మృతి చెందగా పలువురికి గాయాలైన ఘటన శుక్రవారం కోటపల్లి మండలంలో చోటు చేసుకుంది. పిన్నారం గ్రామానికి చెందిన తుంగ రాజ పోచం(48) రెండో కూతురు మనీషా వివాహాన్ని ఈ నెల 20న జరిపేందుకు ముహూర్తం నిర్ణయించారు. మండలం లోని జనగామలో బంధువుల  వివాహానికి హాజరై బంధువులకు వివాహపత్రికలు ఇచ్చేందుకు రాజపోచంతోపాటు భార్య రాజేశ్వరి, తమ్ముడు, మరదలు సమ్మయ్య, సునీత, మరో తమ్ముడి భార్య రాజేశ్వరి, తమ్ముళ్ల ఇద్దరు పిల్లలతో కలిసి ఆటోలో బయలుదేరారు. రొయ్యల పల్లి-ఆల్గామ మధ్యలో ఆటోకు పశువు అడ్డురావడంతో సడెన్‌ బ్రేక్‌ వేయగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో రాజపోచం అక్కడికక్కడే మృతి చెందగా ఆయన మరదలు రాజేశ్వరికి తీవ్ర గాయాలుకాగా, ఇతర కుటుంబీ కులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్‌ ఎస్‌కె జుబేర్‌ పరారయ్యాడు. రాజేశ్వరికి తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. మరో ఐదు రోజుల్లో కూతురు వివాహం సందర్భంగా ఎంతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం విషాదం మిగిల్చింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ కాంతారావు పేర్కొన్నారు.

క్షతగాత్రులను తరలించిన టీఆర్‌ఎస్‌ నాయకులు 

ఆటో అదుపు తప్పి రోడ్డు దిగి బోల్తా పడగా అదే దారిలో ఆల్గామకు వెళ్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులు వెంటనే స్పందిం చారు. వైస్‌ ఎంపీపీ వాలా శ్రీనివాసరావు, సింగిల్‌ విండో చైర్మన్‌ సాంబగౌడ్‌, యూత్‌ అధ్యక్షుడు విద్యాసాగర్‌తోపాటు పలువురు నాయకులు ఆల్గామకు వివాహ నిమిత్తం వెళ్తుండగా మార్గమధ్యలో బాధితుల కేకలు వినిపించాయి. దీంతో వారు అక్కడకు చేరుకుని ఆటోలో చిక్కుకున్న వారిని బయటకు తీసి 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి గాయాలపాలైన కుటుంబీకులను చెన్నూరు ఆసుపత్రికి తరలించారు. ఘటన ప్రాంతాన్ని చెన్నూరు రూరల్‌ సీఐ నాగరాజు సందర్శించారు. 

Read more