రాష్ట్రంలో Weekend curfew అవసరం లేదు

ABN , First Publish Date - 2022-01-20T17:53:10+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణ కోసం అమలు చేస్తున్న వారాంతపు కర్ఫ్యూ అవసరం లేదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి అభిప్రాయపడ్డారు. బుధవారం హుబ్బళ్లిలో ఆయన మీడి

రాష్ట్రంలో Weekend curfew అవసరం లేదు

              - కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి


బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణ కోసం అమలు చేస్తున్న వారాంతపు కర్ఫ్యూ అవసరం లేదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి అభిప్రాయపడ్డారు. బుధవారం హుబ్బళ్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రమంత్రిగా అభిప్రాయపడటం లేదని, కానీ ప్రస్తుత పరిస్థితిలో వారాంతపు కర్ఫ్యూ సరికాదన్నారు. వారాంతపు కర్ఫ్యూతో ఆర్థిక సమస్య తీవ్రమవుతుందన్నారు. ఆర్థిక వ్యవహారాలకు, వ్యాపారాలకు వారంలో రెండురోజుల నిలిపివేయడం అన్ని వర్గాలపై ప్రభావం పడుతుందన్నారు. కర్ఫ్యూపై ముఖ్యమంత్రి బసవరాజ్‌బొమ్మై సమీక్షించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. నిపుణుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఐదురాష్ట్రాల ఎన్నికలపై మాట్లాడుతూ ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌, గోవా, ఉత్తరాఖండ్‌లో బీజేపీకే అనుకూలమని సర్వేలు తేల్చాయన్నారు. ఎన్నికల వేళ ఫిరాయింపులు కొత్తేమి కాదన్నారు. కేరళ రాష్ట్ర ట్యాబ్లోను కేంద్రం తిరస్కరించలేదని, ప్రత్యేకించి శంకరాచార్యుల రూపకం ఏర్పాటు చేయాలని సూచించలేదన్నారు. రిపబ్లిక్‌డే వేడుకలలో పాల్గొనే ట్యాబ్లోలకు సంబంధించి నిబంధనలు ఉన్నాయని వాటిని పాటిస్తారన్నారు. నారాయణగురు విగ్రహాలను భగ్నం చేసిన కమ్యూనిస్టులే ప్రస్తుతం గురుభక్తి చూపుతున్నారన్నారు. ప్రతిపక్షనేత సిద్దరామయ్య పార్టీలు వర్గాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

Updated Date - 2022-01-20T17:53:10+05:30 IST