భీమ్ ప్రతిజ్ఞ వారోత్సవాలు

ABN , First Publish Date - 2021-04-10T06:05:20+05:30 IST

విశ్వజనీన, ఆచరణాత్మక, సహేతుకమైన తత్త్వశాస్త్రాన్ని రూపొందించడం ద్వారా సంస్కృతీ, రాజకీయాలను విప్లవీకరించడంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే అగ్రగణ్యుడు. ఉదాత్తమైన ఆ లక్ష్యాన్ని సాధించేందు...

భీమ్ ప్రతిజ్ఞ వారోత్సవాలు

విశ్వజనీన, ఆచరణాత్మక, సహేతుకమైన తత్త్వశాస్త్రాన్ని రూపొందించడం ద్వారా సంస్కృతీ, రాజకీయాలను విప్లవీకరించడంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే అగ్రగణ్యుడు. ఉదాత్తమైన ఆ లక్ష్యాన్ని సాధించేందుకు తన జీవన సహచరి అయిన సావిత్రిబాయితో కలిసి అలుపెరుగని కృషి చేసిన మహానీయుడు ఫూలే . అణగారిన వర్గాలు అమితంగా అభిమానించి గౌరవించే ఫూలే దంపతులు తమ మేధోసంపత్తిని అన్ని రకాల ఆధిపత్యాలను నిర్మూలించేందుకు వినియోగించారు. సుదీర్ఘ చారిత్రక, సాంస్కృతిక విలువలతో అలరారిన లోకాయత, చార్వాక, బౌద్ధ సంప్రదాయాల పునాదుల మీద , తార్కిక, సమతావాద, ప్రజాస్వామిక సంస్కృతులు, రాజకీయాలను పునర్నిర్మించేందుకు వారు ప్రయత్నించారు. దీనిని సాధించేందుకు,ప్రత్యామ్నాయ విద్యా సంస్థలు అభావృద్ఝిధపరిచారు.


అగ్రకుల వితంతువుల పిల్లలకు శరణాలయాలను నిర్మించారు. వితంతువుల పునర్వివాహాలను ప్రోత్సహించారు. ఆధునికత, స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం లాంటి ఆదర్శాల కేంద్రంగా ఒక జాతీయ సామాజిక వ్యవస్థ నిర్మాణానికి దారులు వేసిన ఈ దేశ తొలి దార్శనికుడు మహాత్మా ఫూలే. బాబాసాహెబ్ అంబేడ్కర్ స్ఫూర్తిదాయక ప్రబోధాల మేరకు మన జీవనకాలంలోనే బుద్ధుని ‘సన్మార్గం’లో పురోగమించాలి. ఈ అవగాహనను ముందుతరాలకు అందించేందుకు ఉస్మానియా విద్యార్థులుగా మేము, ఏప్రిల్ 11న ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ‘భీమ్ ప్రతిజ్ఞ వారోత్సవాలు’ నిర్వహిస్తున్నాము. ప్రజాస్వామికవాదులు అందరూ తమతమ గ్రామాల్లో, పట్టణాల్లో ‘భీమ్ ప్రతిజ్ఞా వారోత్సవాల’ను నిర్వహించవల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.


– ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు

Updated Date - 2021-04-10T06:05:20+05:30 IST