ఆ జ్యూస్‌లు తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు.. అలా పెరగకుండా ఉండాలంటే?

ABN , First Publish Date - 2021-10-13T18:16:13+05:30 IST

కూరగాయలను జ్యూస్‌గా చేసేప్పుడు సాధారణంగా వాటిని వడకట్టి పీచుపదార్థాలను తొలగించి కేవలం జ్యూస్‌ మాత్రమే తాగుతారు. ఇలా చేయడం వల్ల కూరగాయలలోని విటమిన్లు, పోలీఫెనాల్స్‌ అనే యాంటీఆక్సిడెంట్లు లభించినప్పటి

ఆ జ్యూస్‌లు తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు.. అలా పెరగకుండా ఉండాలంటే?

ఆంధ్రజ్యోతి(13-10-2021)

ప్రశ్న: క్యారెట్‌, బీట్రూట్‌ లాంటి కూరగాయల జ్యూస్‌లు తాగడం వల్ల ఉపయోగాలు ఉన్నాయా? ఏ సమయంలో వీటిని తాగితే మంచిది?


- సంయుక్త, గుడివాడ


డాక్టర్ సమాధానం: కూరగాయలను జ్యూస్‌గా చేసేప్పుడు సాధారణంగా వాటిని వడకట్టి పీచుపదార్థాలను తొలగించి కేవలం జ్యూస్‌ మాత్రమే తాగుతారు. ఇలా చేయడం వల్ల కూరగాయలలోని విటమిన్లు, పోలీఫెనాల్స్‌ అనే యాంటీఆక్సిడెంట్లు లభించినప్పటికీ వడకట్టడం వల్ల పీచుపదార్థాలు తగ్గుతాయి. కాబట్టి కూరగాయలు తీసుకోవడం వల్ల వచ్చే సత్ఫలితాలు పూర్తిగా అందవు. అలాగే, కూరగాయలు తిన్నప్పుడు కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. కానీ జ్యూస్‌లు తాగినప్పుడు అలా ఉండదు. ముఖ్యంగా బరువు తగ్గేందుకు జ్యూస్‌ల పైన ఆధారపడితే సత్ఫలితాలు వచ్చినా, దీర్ఘకాలంలో మళ్ళీ బరువు పెరిగిపోతారు. ఈ రసాల్లో చక్కెర, బెల్లం, తేనె వంటి తీపి పదార్థాలు కలపడం వల్ల కెలోరీలు ఎక్కువై బరువు పెరగవచ్చు. దీని వల్ల డయాబెటీస్‌ ఉన్న వారికి రక్తంలో గ్లూకోజు లెవెల్స్‌ పెరుగుతాయి. పళ్ళులేని వారు; ఏదైనా ఆరోగ్య సమస్య రీత్యా డాక్టర్‌ సలహా మేరకు మాత్రమే జ్యూసులు తీసుకోవాలి. మిగిలిన అందరూ కూరగాయలను జ్యూస్‌గా కాకుండా సలాడ్‌గా, వండిన కూరల రూపంలో తీసుకుంటేనే ఉపయోగం ఎక్కువ. 


డా. లహరి సూరపనేనే

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2021-10-13T18:16:13+05:30 IST