పాదాల రక్షణ ఇలా!

ABN , First Publish Date - 2021-01-10T05:55:59+05:30 IST

గోరువెచ్చటి నీటిలో ఉప్పు, నిమ్మరసం కలిపి ఆ నీళ్లల్లో పాదాలను 10 నిమిషాలు ఉంచాలి.

పాదాల రక్షణ ఇలా!

చలికాలంలో పాదాలు పగులుతాయి. కొన్ని టిప్స్‌తో పాదాలను కాపాడుకోవచ్చు. అవేమిటంటే..


  గోరువెచ్చటి నీటిలో ఉప్పు, నిమ్మరసం కలిపి ఆ నీళ్లల్లో పాదాలను 10 నిమిషాలు ఉంచాలి. పొడి పాదాలకు ఫుట్‌ క్రీమును రాయాలి.

 పడుకునే ముందు పాదాలకు ఫుట్‌ క్రీమ్‌ రాసుకోవాలి. 

 కొబ్బరినూనె, బాదం నూనె, నువ్వుల నూనె, నెయ్యి వంటివాటితో పాదాలను మసాజ్‌ చేస్తే రక్తప్రవాహం బాగా జరుగుతుంది. పాదాలను మర్దనా చేయడం వల్ల వాటిల్లోని తేమగుణం పోదు. 

 పాదాల మడమలు పొడారి, పగుళ్లు పూర్తిగా పోకపోతే పెట్రోలియం జెల్లీని పాదాలకు వాడితే మృదువుగా ఉంటాయి..

 పాదాలకు సాక్సు వేసుకోవాలి. కాటన్‌ సాక్స్‌ వేసుకుంటే మంచిది.

 సాక్సు వల్ల పాదాలలో ఉండే తేమ పోదు. మృదువుగా ఉంటాయి. 

 పాదాల మడమలను పూర్తిగా కప్పి ఉంచేలాంటి షూ వేసుకోవాలి.

 ఎక్కువసేపు ఒకే భంగిమలో నిలబడడం వల్ల పాదాలపై బరువుపడినట్టయి అక్కడి చర్మం దెబ్బతింటుంది.

 చలికాలంలో ఇంట్లో తిరిగేటప్పుడు చెప్పులు తప్పకుండా వేసుకోవాలి.

 ఫ్రాగ్రెన్స్‌-ఫ్రీ క్లెన్సర్స్‌ను వాడాలి.

 చలికాలంలో స్నానానికి గోరువెచ్చటి నీళ్లు ఉపయోగించాలి. ఐదు నిమిషాల్లో స్నానం ముగించాలి.

 ఎక్కువసేపు నడిచేటప్పుడు మధ్యమధ్యలో పాదాలకు విశ్రాంతినివ్వాలి.ఫ


Updated Date - 2021-01-10T05:55:59+05:30 IST