ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు!

ABN , First Publish Date - 2021-03-23T17:46:33+05:30 IST

చాలామంది బరువు తగ్గాలనే తొందరలో ఆహార పరిమితులు విధించుకుంటారు. అలా కాకుండా ఆరోగ్యకరంగా తినడం అలవాటు చేసుకోవాలి అంటున్నారు పోషకాహార నిపుణురాలు పూజా మల్హోత్రా. ఆమె చెబుతున్న డైట్‌ టిప్స్‌ ఇవి...

ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు!

ఆంధ్రజ్యోతి(23-03-2021)

చాలామంది బరువు తగ్గాలనే తొందరలో ఆహార పరిమితులు విధించుకుంటారు. అలా కాకుండా ఆరోగ్యకరంగా తినడం అలవాటు చేసుకోవాలి అంటున్నారు పోషకాహార నిపుణురాలు పూజా మల్హోత్రా. ఆమె చెబుతున్న డైట్‌ టిప్స్‌ ఇవి...


బ్రేక్‌ఫాస్ట్‌: బ్రేక్‌ఫాస్ట్‌గా ప్రాసెస్డ్‌ ఫుడ్‌, రెడీ టు ఈట్‌ ఫుడ్స్‌ తినడం ఆరోగ్యానికి చేటు చేస్తుంది. అందుకే చాలా వరకు ఇంటి వద్ద తయారుచేసిన బ్రేక్‌ఫాస్ట్‌ తినడం ఉత్తమం. 


పండ్లు, కూరగాయలు: ప్రతిరోజు కనీసం ఐదు నుంచి ఏడు సార్లు పండ్లు, కూరగాయలు తినాలి. ఎందుకంటే వీటిలో ఎక్కువగా లభించే పీచుపదార్థం, పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.


గింజలు, నట్స్‌: గుప్పెడు నట్స్‌, గింజలు ఆరోగ్యకరమైన చిరుతిండి. వీటిలోని ప్రొటీన్లు బరువు పెరగకుండా చూస్తూనే ఆకలిని తగ్గిస్తాయి. 


నో గ్యాడ్జెట్స్‌: భోజనం సమయంలో ఫోన్‌, టీవీ, పుస్తకాలు, పత్రికలు చూడడం మానేయాలి. దాంతో మనసు పెట్టి తింటారు. ఎక్కువగా తినరు కూడా. 


రాత్రి భోజనం: తక్కువ పరిమాణంలోనే రాత్రి భోజనం ముగించాలి. అది కూడా నిద్రకు రెండు లేదా రెండున్నర గంటల ముందే తినాలి. అప్పుడే ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. చక్కగా నిద్రపడుతుంది. 


నీళ్ల మోతాదు: రోజుకు కనీసం రెండు నుంచి రెండున్నర లీటర్ల నీళ్లు తప్పకుండా తాగాలి. ఫలితంగా డీహైడ్రేషన్‌, ఒంట్లో మలినాలు పేరుకుపోవడం, అలసట, తలనొప్పి, జీర్ణసంబంధ సమస్యలు వంటివి దరిచేరవు.

Updated Date - 2021-03-23T17:46:33+05:30 IST