ఎయిర్‌పోర్టులో జాహ్నవికి ఘనస్వాగతం

ABN , First Publish Date - 2022-07-07T05:09:23+05:30 IST

పోలెండ్‌లో జరిగిన అస్త్రా 45మిషన్‌ అంతరిక్ష పరిశోధనల్లో

ఎయిర్‌పోర్టులో జాహ్నవికి ఘనస్వాగతం
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జాహ్నవి

శంషాబాద్‌ రూరల్‌, జూలై 6: పోలెండ్‌లో జరిగిన అస్త్రా 45మిషన్‌ అంతరిక్ష పరిశోధనల్లో పాల్గొని స్వదేశానికి తిరిగి వచ్చిన ఏపీకి చెందిన జాహ్నవికి బుధవారం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కుటుంబసభ్యులు బంధువులు ఘన స్వాగతం పలికారు. ఈస్ట్‌గోదావరి పాలకొల్లు ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌, పద్మ దంపతుల కూతురు జాహ్నవి జూన్‌ 15 నుంచి 25 వరకు పోలెండ్‌లో జరిగిన అస్త్రా 45 మిషన్‌ అంతరిక్ష పరిశోధనల్లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నపుడు తన అమ్మమ్మ చెప్పిన చందమామ కథలు విని ప్రేరణ పొందినట్లు తెలిపింది.  అస్త్రా 45 మిషన్‌లో మొత్తం ఆరుగురు పాల్గొన్నారని, అందులో భారత్‌ నుంచి ఇద్దరు, పోలెండ్‌, తునేషియా నుంచి మిగతావారు ఉన్నారని తెలిపింది. ఇందులో పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌గా పనిచేయడం పట్ల జాహ్నవి హర్షం వ్యక్తం చేసింది. 


Updated Date - 2022-07-07T05:09:23+05:30 IST