టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లుకు ఘనస్వాగతం

ABN , First Publish Date - 2022-08-07T05:08:41+05:30 IST

టీడీపీ బీసీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మా జీ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం జిల్లా పర్యటనకు వచ్చారు. ఈసందర్భంగా ఆయన బెంగళూరు మీదుగా జిల్లాకు రాగా, అక్కడి విమానాశ్రయంలో గోరంట్ల, రొళ్ల టీడీపీ బీసీ నాయకులు ఘనస్వాగతం పలికారు.

టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లుకు ఘనస్వాగతం
బెంగళూరు విమానాశ్రయంలో కొల్లు రవీంద్రకు స్వాగతం పలుకుతున్న టీడీపీ నాయకులు

గోరంట్ల/రొళ్ల, ఆగస్టు 6: టీడీపీ బీసీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మా జీ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం జిల్లా పర్యటనకు వచ్చారు. ఈసందర్భంగా ఆయన బెంగళూరు మీదుగా జిల్లాకు రాగా, అక్కడి విమానాశ్రయంలో గోరంట్ల, రొళ్ల టీడీపీ బీసీ నాయకులు ఘనస్వాగతం పలికారు. పూలబొకేలు అందజేశారు. కార్యక్రమంలో గోరంట్ల నాయకులు, టీడీపీ బీసీసెల్‌ అధ్యక్షుడు కుంటిమద్ది రంగయ్య, ప్ర ధాన కార్యదర్శి గిరిధర్‌గౌడ్‌, రాష్ట్ర బోయ సాధికార సమితి అధ్యక్షు లు, మాజీ జడ్పీ చైర్మన పూల నాగరాజు, కురుబ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు రమణ, రాష్ట్ర వడ్డెర సాధికార సమితి అధ్యక్షులు వెంకట్‌, పోతులయ్య, బెస్త నాగరాజు, రొళ్ల టీడీపీ నాయకులు, రాష్ట్ర వక్కలిగ సాధికార సమితి కన్వీనర్‌ వీఎం పాండురంగప్ప, బీసీ సెల్‌ జిల్లా కార్యదర్శి రవిభూషణ్‌, తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఉగ్ర నరసింహప్ప, మాజీ సింగిల్‌విండో అధ్యక్షులు రామన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-07T05:08:41+05:30 IST