Advertisement

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు సాదర స్వాగతం

Mar 1 2021 @ 23:42PM
విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌

ఎన్‌ఏడీ జంక్షన్‌, మార్చి 1 : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ సోమవారం మధ్యాహ్నం నగరానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 1.20 గంటలకు ఇండిగో విమానంలో విజయవాడ నుంచి వచ్చిన ఆయనకు జిల్లా అధికారులు స్వాగతం పలికారు. విమానాశ్రయం టెర్మినల్‌ భవనంలోని వీఐపీ లాంజ్‌లో విశ్రాంతి తీసుకున్న అనంతరం నగరంలోని సర్క్యూట్‌ హౌస్‌కు వెళ్లారు. జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. ఎస్‌ఈసీకి స్వాగతం పలికేందుకు కలెక్టర్‌ వినయ్‌చంద్‌, పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌ కుమార్‌ సిన్హా, ఇతర అధికారులు వచ్చారు.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.