యడ్యూరప్పకు ఘన స్వాగతం

ABN , First Publish Date - 2022-08-11T04:55:42+05:30 IST

మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనార్థం మంత్రాలయానికి వచ్చిన కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, ఆయన కుమారులు శివమొగ్గ ఎంపీ రాఘవేంద్ర, ఎమ్మెల్యే విజయేంద్రలు బుధవారం రాత్రి 9.15 గంటలకు మంత్రాలయం వచ్చారు.

యడ్యూరప్పకు ఘన స్వాగతం

మంత్రాలయం, ఆగస్టు 10: మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనార్థం మంత్రాలయానికి వచ్చిన కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, ఆయన కుమారులు శివమొగ్గ ఎంపీ రాఘవేంద్ర, ఎమ్మెల్యే విజయేంద్రలు బుధవారం రాత్రి 9.15 గంటలకు మంత్రాలయం వచ్చారు. వీరికి సుజీంద్ర ఏసీ అతిథి గృహం వద్ద అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహమూర్తి, బెంగుళూరు బీజేపీ పట్టణ అద్యక్షులు సుబ్బ నరసింహం, బిందుమాధవ్‌, జేపీ స్వామి, ఆదోని ఇనచార్జి డీఎస్పీ వెంకటాద్రి, మంత్రాలయం సీఐ భాస్కర్‌, ఎస్‌ఐ వేణుగోపాల్‌రాజు, రాయచూరు జిల్లా ఎస్పీ నిఖిల్‌, రాయచూరు డీఎస్పీ వెంకటే్‌షలు ఘనంగా స్వాగతం పలికారు. వీరు మంత్రాలయంలోనే రాత్రి బస చేసి గురువారం ఉదయం రాఘవేంద్రస్వామిని దర్శించుకోనున్నారు. 

మహాముఖద్వారం ఎలివేషన ప్రారంభం 

మంత్రాలయం, ఆగస్టు 10: మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం మహాముఖద్వారం పై అంతస్తులో శ్రీమఠం రూ.50లక్షల నిధులతో నిర్మించిన ఎలివేషనను పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ప్రారంభించారు. బుధవారం రాత్రి ప్రముఖ దాత బళ్లారి నారాయణ రెడ్డి, మఠం ఈఈ సురేష్‌ కోనాపూర్‌, ఏఈ బద్రినాథ్‌ల సమక్షంలో విధ్వాన రాజాఎస్‌ గిరిరాజాచార్‌ చేతుల మీదుగా శిలాఫలాకాన్ని ఆవిష్కరించి శాంతిపూజలు చేసి ప్రారంభించారు. నెలన్నరలోనే పై అంతస్తు ఎలివేషన పనులు అందంగా తీర్చిదిద్దిన ఈఈ సురేష్‌ కోనాపూర్‌, ఏఈ బద్రినాథ్‌, ఇంజనీర్‌ సెక్షన సిబ్బందిని పీఠాధిపతి అభినందించి శేషవస్త్రం, ఫలపుష్ప మంత్రాక్షితలు ఇచ్చి సన్మానించారు. 


Updated Date - 2022-08-11T04:55:42+05:30 IST