తెలంగాణలో సంక్షేమానికి పెద్దపీట

ABN , First Publish Date - 2020-10-25T06:05:25+05:30 IST

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలో సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

తెలంగాణలో సంక్షేమానికి పెద్దపీట

నవాబ్‌పేట, అక్టోబరు 24: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలో సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన గురుకుంటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం ఏటా రూ. 35 వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. కల్యాణలక్ష్మి, రుణమాఫీ, రైతుబంధు, రైతు బీమా వంటి అనేక పథకాలను అమలు చేస్తూ, రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారి, ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కరువైందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ది సాదిస్తున్నట్లు తెలిపారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఇప్పటికే అనేక అభివృద్ది పనులు చేపట్టినట్లు తెలిపారు. నారా యణపేట జిల్లాలో సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.


మిగతా జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసు కెళ్లినట్లు తెలిపారు. రెవెన్యూ శాఖలో అనేక మార్పులు తెచ్చిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే ఇంకా ఎన్నో రంగాల్లో అభివృద్ధి సాధించే అవకాశం ఉందన్నారు. మహబూబ్‌నగర్‌, కొందూర్గు వయా నవాబ్‌పేట మధ్య ఉన్న రహదారిపై శిథిలావస్థకు చేరిన వంతెనల స్థానంలో కొత్తవి నిర్మించేందుకు కృషి చేయన్నుట్లు తెలిపారు.


బతుకమ్మ ఆడిన ఎంపీ

నవాబ్‌పేట మండలం పల్లెగడ్డ గ్రామంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి శనివావారం బతుకమమ్మ ఆడారు. టీవీ కళాకారిణి కొమ్రక్క, ఎంపీపీ అనంతయ్య, సింగిల్‌ విండో చైర్మన్‌ నర్సింహులు, ఎంపీటీసీ అనితలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.50 లక్షలతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టి, ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానని చెప్పారు. కార్యక్రమంలో ప్రతాప్‌, గాండ్ల రవి, శ్రీనివాసులు, సత్యం పాల్గొన్నారు.

Updated Date - 2020-10-25T06:05:25+05:30 IST