సంక్షేమ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలి

ABN , First Publish Date - 2022-05-26T07:06:42+05:30 IST

మైనార్టీల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన పథకాలను పూర్తిస్థాయిలో అమలు జరిగేలా ఆయా శాఖల అధికారులు అంకితభావంతో కృషిచేయాలని జాతీయ మైనార్టీ కమిషన్‌ సభ్యురాలు సయ్యద్‌ షెహజాదీ అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆమె ప్రధానమంత్రి

సంక్షేమ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలి
మాట్లాడుతున్న జాతీయ మైనార్టీ కమిషన్‌ సభ్యురాలు

మైనార్టీ యువతులకు శిక్షణలో ప్రాధాన్యం ఇవ్వాలి

జాతీయ మైనార్టీ కమిషన్‌ సభ్యురాలు షెహజాదీ

నిజామాబాద్‌, మే 25(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మైనార్టీల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన పథకాలను పూర్తిస్థాయిలో అమలు జరిగేలా ఆయా శాఖల అధికారులు అంకితభావంతో కృషిచేయాలని జాతీయ మైనార్టీ కమిషన్‌ సభ్యురాలు సయ్యద్‌ షెహజాదీ అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆమె ప్రధానమంత్రి 15 సూత్రాల పథకం అమలుపై అధికారులతో సమీక్షించారు. సమాజంలో వెనుకబడి ఉన్న వారిలో అత్యధికులు ముస్లిం మైనార్టీలేనని వారందరి అభ్యున్నతి కోసం కృషిచేయాలన్నారు. పథకాలు వందశాతం అమలయ్యే విధంగా చూడాలన్నారు. జిల్లాలో షాదీముబారక్‌ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అర్హులె ౖన వారికి చొరవ చూపాలన్నారు. వృతి నైపుణ్య శిక్షణ కోసం ఎక్కువ మం దిని ఎంపిక చేస్తూ నాణ్యమైన శిక్షణ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాల కార్మికుల కోసం ఉద్దేశించిన ఎన్‌సీఎల్‌బి పాఠశాలలను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వ అనుమతి కోరాలన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు అందిస్తున్న ముందస్తు ఉచిత శిక్షణలో యువతులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవాలన్నారు. వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. అవసరమైతే మసీదు నిర్వహణ కమిటీల సహకారం తీసుకోవాలని సూచించారు. 

పాఠశాలల్లో ప్రధాని ఫొటో కూడా ఉండాలి

మైనార్టీ రెసిడెన్షియల్‌ విద్యా సంస్థలతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం ఫొటోతో పాటు తప్పనిసరిగా ప్రధాని ఫోటో కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యా, ఉపాధి రంగాలకు సంబంధిం చి మైనార్టీలకు విరివిగా రుణాలు అందజేయాలన్నారు. ఆ తర్వాత విదేశాలలో ఉన్న త విద్య కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నందున సద్వినియోగం చేసుకునే విధంగా చూడాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఉపకార వేతనాల గురించి మైనార్టీ విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.  జిల్లాస్థాయిలో అధికారంలో ఉన్న అధికారులందరూ సేవా ధృక్పథంతో పనిచేస్తూ పేద వర్గాల అభివృద్ధికి తోడ్పడాలని ఆమె కోరారు. ఆ తర్వాత కలెక్టర్‌ నారాయణరెడ్డి మాట్లాడుతూ ఐసీడీఎస్‌, మైనార్టీ విద్యాసంస్థలు, మహిళ శిశు సంక్షేమ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మైనార్టీల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను పూర్తి చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, చిత్రా మిశ్రా, డీసీపీ అరవిందబాబు, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నాగోరావు, జడ్పీ సీఈవో గోవింద్‌, డీపీవో జయసుధ, ఆర్డీవో రవితో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-26T07:06:42+05:30 IST