ఏపీలో ఉన్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు: మంత్రి అవంతి

Published: Sun, 13 Mar 2022 15:53:20 ISTfb-iconwhatsapp-icontwitter-icon

విశాఖ: ఏపీలో ఉన్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇళ్ల పట్టాలను కొందరు కోర్టుకెళ్లి అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. వేర్పాటు ఉద్యమాలు రాకుండా ఉండేందుకే 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో ఆలస్యం కావడం వాస్తవమేనని తెలిపారు. ఈ ఏడాదిలోగా లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అందిస్తామని ప్రకటించారు. 3 రాజధానులపై కోర్టు తీర్పును గౌరవిస్తామని చెప్పారు. సాంకేతికమైన సమస్యలను అధిగమించి 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. అమరావతితో పాటు ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేస్తామంటే.. అభ్యంతరాలు ఎందుకో అర్ధం కావడం లేదన్నారు. కేంద్రం అప్పులు చేయకుండానే ప్రభుత్వాన్ని నడుపుతోందా? అని అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.