అందరికీ సంక్షేమ పథకాలు

ABN , First Publish Date - 2021-07-27T04:31:15+05:30 IST

రాష్ట్రంలోని అర్హులైన ప్రతి నిరుపేదకు కూడు, గూడు కల్పించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

అందరికీ సంక్షేమ పథకాలు
రేషనకార్డు అందజేస్తున్న మంత్రి పువ్వాడ

 జిల్లాకు 12,111 రేషనకార్డులు మంజూరు

 ఆగస్టు నుంచే రేషన సరుకులు

 కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ

ఖమ్మం కలెక్టరేట్‌, జూలై 26: రాష్ట్రంలోని అర్హులైన ప్రతి నిరుపేదకు కూడు, గూడు కల్పించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలోని డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు గుర్తింపు వచ్చిందని అదే స్పూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు తిండిగింజలను అందించేందుకు వీలుగా రేషన వ్యవస్థ ద్వారా అర్హులైన వారికి బియ్యాన్ని పంపిణీ చేస్తుంద న్నారు. సోమవారం ఖమ్మంలోని డీపీఆర్సీ భవనంలో జిల్లాకు మంజూ రైన కొత్త రేషన కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 12,111 కొత్త రేషన కార్డులు మంజూరయ్యా యన్నారు. రేషన కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న నిరుపేదలకు కొత్త కార్డులను తొలివిడతలో మంజూరయ్యాయని పెండింగ్‌లో ఉన్న వాటికి కూడా మరో మారు అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. కొత్త కార్డులకు ఆగస్టు నెల నుంచే లబ్దిదారులకు బియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పరిమితి లేకుండా కుటుంబంలోని సభ్యులందరికీ ఆరు కిలోల చొప్పున రేషన బియ్యాన్ని అందిస్తోందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ మాట్లాడుతూ జిల్లాకు కొత్తగా 12,111 కార్డులు మంజూరయ్యాయని అర్భన మండలంలో 2076 కార్డులు అధికంగా వచ్చాయని తెలిపారు.ఈ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన కొండబాల కోటేశ్వరరావు, నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన బచ్చు విజయ్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ పాతిమా జోహరా, జిల్లా అదనపు కలెక్టర్‌ ఎన మధుసూదన, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజేందర్‌, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాధ్‌, తహసీల్దార్‌ శైలజ, నగరపాలక కార్పొరేటర్‌ పగడాల శ్రీవిద్య, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-27T04:31:15+05:30 IST